చంద్రబాబు - జగన్‌ దొందూ దొందే: నాగబాబు

Update: 2019-02-18 07:58 GMT
నాగబాబు ఒకప్పుడు సాఫ్ట్‌. ఇప్పుడు మాత్రం కాదు. అవకాశం ఉన్నప్పడల్లా.. బాలయ్యని - టీడీపీని ఏకి పారేస్తున్నారు నాగబాబు. తనకంటూ ఓ యూట్యూబ్‌ చానెల్‌ పెట్టుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ జనసేన కోసమే అని కొంతమంది అంటుంటే.. ఎన్నికల దగ్గరపడడంతో నాగబాబు వివాదాలు సృష్టించేందుకు అని మరికొంతమంది విమర్శిస్తున్నారు.
    
టీడీపీ - వైసీపీ - బాలయ్యపై విమర్శల నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్‌ కు నాగబాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తాను ఎందుకు ఇదంతా చేస్తుందో చాలా క్లియర్‌గా చెప్పారు  ఆయన. తాను జనసేనలో చేరను కానీ.. పార్టీ కోసం పనిచేస్తారని చెప్పారు. గత పదేళ్లనుంచి బాలయ్య మమ్మల్ని ఏదో ఒక మాట అంటున్నారు అని అన్నారు. అన్నయ్యని చూసి ఇన్నాళ్లు ఆగానని.. కానీ ఇకమీద ఆగాల్సిన అవసరం లేదనే ప్రతిదాడికి దిగానని చెప్పారు. ఇక 2014లో టీడీపీకి పవన్ కల్యాణ్‌ ఎందుకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందో కూడా చెప్పుకొచ్చారు. “2014లో వైసీపీ గాలి చాలా ఎక్కువుగా ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఒక అనుభవం ఉన్న నాయకుడు అవసరం రాష్ట్రానికి కావాలని ఆలోచించిన పవన్‌.. చంద్రబాబు పార్టీకి సపోర్ట్‌ చేశారు. దీనికి పవన్‌ ని ప్యాకేజ్‌ స్టార్‌ అని విమర్శిస్తున్నారు. అలా విమర్శించే వాళ్లని చెప్పుతో కొడతా. వాళ్లని ఎలాంటి మాటలు అన్నా కూడా తప్పులేదు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు నాగబాబు.
Tags:    

Similar News