యాడ్ మహారాజ్ ముద్రా కృష్ణమూర్తి కన్నుమూత

Update: 2016-02-05 10:22 GMT
భారతదేశంలో అడ్వర్టైజింగ్ అన్నది ఒక రంగంగా మార్చటంలో విశేషమైన కృషి చేయటంతో పాటు.. దానికో క్రేజ్ తెచ్చిన వ్యక్తిగా ముద్రా యాడ్స్ వ్యవస్థాపక ఛైర్మన్ ఏజీ కృష్ణమూర్తి అలియాస్ అచ్చుతని గోపాలకృష్ణమూర్తి ఊపిరి ఆగింది. యాడ్ మహారాజుగా చెప్పుకునే ఆయన హఠ్మాన్మరణం దిగ్భాంత్రికి గురి చేసింది. 1942 ఏప్రిల్ 8న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన ఆయన.. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు.

అనంతరం ముంబయి వెళ్లిన ఆయన.. క్వాలికో టెక్స్ టైల్స్ మిల్లులో చిరుద్యోగిగా చేరారు. అనంతరం రిలయన్స్ అధినేత ధీరుబాయి అంబాని నెలకొల్పిన రిలయన్స్ ఇండస్ట్రీలో చేరిన ఆయన.. తర్వాత శిల్పి యాడ్స్ లో మేనేజర్ గా చేరారు.

1980లో సొంతంగా ముద్రా కమ్యూనికేషన్స్ అండ్ అడ్వర్టైజింగ్ ను షురూ చేశారు. విమల్.. రస్నా లాంటి యాడ్స్ ఆయనకు విశేష పేరుప్రఖ్యాతులు తీసుకురావటమే కాదు.. యాడ్స్ విభాగంపై దేశంలో అవగాహన పెరిగేలా చేయటంతో పాటు..ఈ రంగానికి ఒకక్రేజ్ తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ధీరూబాయ్ అంబానీ జీవితంపై అనేక పుస్తకాలు రాసిన ఆయన.. జీవనశైలి.. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు పుస్తకాలు రచించారు. పలు మీడియా సంస్థలకు కాలమ్స్ రాసేవారు.
Tags:    

Similar News