మారుమూల గ్రామంలో ఆ పనిచేస్తున్న ఎంఎస్ ధోని.. వైరల్

Update: 2022-06-30 14:39 GMT
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏది చేసినా అందులో ప్రత్యేకత ఉంటుంది. ఊహకందకుండా చేయడంలో ధోని దిట్ట.. ఆడే అన్ని ఆడుతుంటాడు. తన స్టామినా తగ్గిపోయిందనగానే తన వారసులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి వైదొలుగుతాడు. అతి సాధారణ జీవితం గడపడం ధోనికి అలవాటు. అదే అతడిని క్రికెటర్లందరిలోనూ ప్రత్యేకంగా నిలిపింది.

టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నారు. ఆ టీంను విజయవంతంగా నడుపుతున్నాడు. మధ్యలో రవీంద్ర జడేజాకు బాధ్యతలు అప్పగించినా అతడు విఫలం కావడంతో మళ్లీ పగ్గాలు అందుకున్నాడు.

ఎంఎస్ ధోని గత కొన్ని రోజులుగా మోకాలి సమస్యతో బాధపడుతున్నాడు. అయితే పెద్ద డాక్టర్ల వద్దకు వెళ్లకుండా అతడు నాటు వైద్యం పొందుతున్నాడు. ఇందుకోసం ప్రతి 4 రోజులకు ఒకసారి రాంచీకి 70 కి.మీల దూరంలో గల ఓ మారుమూల గ్రామంలోని నాటు వైద్యుడు వందన్ సింగ్ ఖేర్వార్ ను కలుస్తున్నాడట.. ఇందుకు ధోని చెల్లిస్తున్న ఫీజు కేవలం రూ.40 మాత్రమే.

అక్కడికి వెళ్లి నాటు వైద్యం చేయించుకుంటున్న ధోని అక్కడి గిరిజనులతో కలిసిపోయి ప్రకృతి రమణీయతను ఎంజాయ్ చేస్తున్నాడు. పొలాల గట్లు, చెట్ల కింద గిరిజనులతో కూర్చొని సేదతీరుతున్నాడు. ధోనితో గిరిజనులు ఉన్న ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.
Tags:    

Similar News