లాక్ డౌన్ పొడగింపు వద్దని చెప్పిన సీఎం..ఎవరంటే ?

Update: 2020-04-11 11:30 GMT
దేశంలో కరోనా రోజురోజుకి మరింతగా విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో దేశంలో దాదాపు  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌ డౌన్ పొడగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒడిశా - పంజాబ్ ముఖ్యమంత్రులు అయితే ఏకంగా - కేంద్రం కంటే ముందే  లాక్‌ డౌన్ ను పొడగిస్తునట్టు ఇప్ప్పటికే ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఇదే నిర్ణయాన్ని ముక్త కంఠంతో శనివారం జరిగిన ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన  వీడియో కాన్ఫరెన్స్‌ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి సూచించారు.

దాదాపు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏప్రిల్ నెలాఖరు వరకూ లాక్‌ డౌన్ ఖచ్చితంగా పొడగించాల్సిందేనని ప్రధాని మోదీకి  సూచించారు. అయితే , తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం ఏప్రిల్ 30 వరకూ లాక్‌ డౌన్ పెంపుపై విముఖత వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఏప్రిల్ నెలాఖరు వరకూ లాక్‌ డౌన్ పెంపుపై ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫెరెన్స్‌ లో ఆయన తీవ్రంగా విభేదించినట్లు  విస్వసనీయవర్గాల సమాచారం. అయితే , అయన లాక్ డౌన్ పొడగింపు పై ఎందుకు విముఖత వ్యక్తం చేసారో తెలియదు. అలాగే మరికొంతమంది కేవలం రెడ్‌ జోన్‌ లలో లాక్‌ డౌన్ ను కొనసాగించి , ఈ మహమ్మారి ప్రభావం అంతగా  లేని ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలను కొంత సడలించే అవకాశముందని  మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News