• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చైనా బస్సుపై మోడీ మోజు

చైనా బస్సుపై మోడీ మోజు

By - Tupaki Desk
Update: 2016-08-07 11:22 GMT
 కార్లు మీదుగా ప్రయాణించే సరికొత్త మోడల్ బస్సును ఇటీవల చైనాలో ప్రారంభించారు. ఇప్పుడీ బస్సు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. మన ప్రధాని మోడీకూడా దీనిపై మనసు పడినట్లుగా ఉంది. దాని సంగతేంతో కనుక్కోమని  రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖను ఆయన ఆదేశించారు. ప్రపంచంలోనే తొలిసారి చైనా రూపొందించిన ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ నిజంగా ఒక అద్భుతమే.

ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ (టీఈబీ-1) పిలిచే ఈ భారీ బస్సును ఉత్తర చైనాలోని హ బెయి ప్రావిన్స్‌ లోని కిన్‌ హువాంగ్‌ డావో నగరంలో టెస్ట్ రన్ నిర్వహించారు. 25 అడుగుల వైశాల్యమున్న ఈ బస్సు రోడ్డు నుంచి దాదాపు రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో మిగతా వాహనాలు ఈ బస్సుకింద నుంచి ప్రయాణం చేయవచ్చు. అంటే బ్రిడ్జి కింద నుంచి వెళ్లినట్లుగా మిగతా వాహనాలు వెళ్లిపోతాయి. అవి వెళ్తాయనే కంటే ఈ బస్సే వాటిపైనుంచి వెళ్తుందని చెప్పాలి.

రోడ్డుకిరువైపులా నిర్మించిన ప్రత్యేక మార్గం ద్వారా ఈ బస్సు ప్రయాణిస్తుంది. ఒకేసారి నాలుగు బస్సు కోచ్‌ లను కలపడం ద్వారా దాదాపు 1400 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. బస్సు లోపలి భాగం చాలా విశాలంగా ఉంది. రెండు వైపులా సీట్లు - మధ్యలో రౌండ్ సీట్లతో కంపార్టుమెంట్ చాలా స్టైలిష్ లుక్‌తో ఉంది. పైగా దీని తయారికి అయ్యే ఖర్చు కూడా తక్కువేనట.  కరెంటుతో పనిచేసే ఇది రోడ్డుకు రెండువైపులా ఉండే ప్రత్యేక మార్గంపై నడుస్తుంది. మధ్యలో ఖాళీ ఉంటుంది. అంటే ఈ బస్సు ఒక బ్రిడ్జిలా ఉంటుందన్నమాట.  గంటకు 60 కిమీ గరిష్ట వేగంతో నడిచే ఈ బస్సు మన దేశానికి బాగా ప్రయోజనకరమని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ట్రాఫిక్ కు ఏమాత్రం ఆటంకం కాకుండా కింద నుంచి మిగతా వాహనాలు వెళ్లేలా ఉంటుంది. అదే సమయంలో ఇందులో ఎక్కువమంది పడతారు కాబట్టి మిగతా వాహనాల రద్దీ కూడా తగ్గుతుంది. ఇప్పుడీ బస్సు మోడీ దృష్టిని ఆకర్షించడంతో దాని వివరాలు తెలుసుకోమని ఆదేశించారు.
Full View

Tags:    
  • Modi 
  • China 
  • Transit Elevated Bus 

Similar News

కాక రేపిన రాహుల్ ప‌ర్య‌ట‌న.. నేత‌ల హౌస్ అరెస్టులు

2026-11-14 10:44 GMT

అమెరికాలో ఏమైపోతోంది? మూడు నెలల కరెంట్ ఉండదనే భయంతో జనాల పరుగులు!

2026-11-14 10:43 GMT

హీటెక్కిన సిక్కోలు పాలిటిక్స్‌.. జ‌డ్పీ చైర్మ‌న్ పోటాపోటీ ..!

2026-11-14 10:30 GMT

లోకేష్‌పై ఆ 'మ‌చ్చ‌లు' పోతున్నాయ్‌.. !

2026-11-14 09:30 GMT

పాకిస్థాన్‌లో ఉద్యోగాల కోసం దేశం విడుస్తున్న ప్రజలు.. అధికారుల విదేశీ ఆస్తులపై ఆరోపణలు!

2026-11-14 08:52 GMT

రాజమండ్రి మరో అనంతపురం అవుతుందా? ఆసక్తికరంగా కార్పొరేషన్ పోరు

2026-11-14 08:30 GMT

చంద్ర‌బాబు సీరియ‌ల్ పారిశ్రామికవేత్త‌: లోకేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

2026-11-14 07:49 GMT

ట్రంప్ కొంపముంచేశాడు.. అధ్యక్ష రేసు నుంచి జేడీ వాన్స్ తప్పుకుంటారా?

2026-11-14 07:19 GMT

ఉత్తర కోస్తాకు మరో తుపాను ముప్పు: 18న అర్ధరాత్రి తీరం దాటే అవకాశం

2026-11-14 06:54 GMT

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ సింగపూర్‌దే.. భారత్ స్థానం ఎంతంటే?

2026-11-14 05:23 GMT

Nvidia నెక్ట్స్ సీఈవో రెనే హాసేనా? ఆర్మ్ బాస్ పేరు తెరపైకి.. ఇంకా ఉత్కంఠే!

2026-11-14 05:04 GMT

మొన్న ఎన్వీడియో.. నిన్న మైక్రోసాఫ్ట్.. నేడు విమానాలన్నీ బంద్.. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది?

2026-11-14 04:17 GMT

Copyright @2026

Powered by Blink CMS