• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Travel >  ప్రపంచంలోనే అత్యంత...

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ సింగపూర్‌దే.. భారత్ స్థానం ఎంతంటే?

| 2026 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 193 గమ్యస్థానాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. జపాన్, దక్షిణ కొరియా, యూఏఈ రెండో స్థానంలో ఉన్నాయి. భారత్ 84వ ర్యాంక్ సాధించినప్పటికీ, వీసా లేకుండా ప్రయాణించగల గమ్యస్థానాలు గతేడాది 57 నుంచి 55కు తగ్గాయి.

By - Tupaki Desk
Update: 2026-11-14 05:23 GMT

విదేశాలకు వెళ్లాలంటే ముందుగా వీసా తీసుకోవడం తప్పనిసరి. అయితే కొన్ని దేశాల పాస్‌పోర్ట్ ఉన్నవారికి ఈ ఇబ్బంది ఉండదు. వీసా కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోకుండానే ఎన్నో దేశాల్లో పర్యటించవచ్చు. ఈ విషయంలో ఏ దేశ పాస్‌పోర్ట్ ఎంత బలంగా ఉందో తెలిపే 2026 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజాగా ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది.

ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ దేశ పాస్‌పోర్ట్ ఉన్నవారు ముందస్తు వీసా లేకుండా 193 గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. జపాన్, దక్షిణ కొరియా, యూఏఈ దేశాలు 188 గమ్యస్థానాలతో రెండో స్థానంలో నిలిచాయి. స్వీడన్ 187 గమ్యస్థానాలతో మూడో స్థానాన్ని సాధించింది. అమెరికా 180 గమ్యస్థానాలతో పదో స్థానంలో ఉండగా.. ఇజ్రాయెల్ 167 గమ్యస్థానాలతో 17వ స్థానంలో ఉంది.

ఇక భారత పాస్‌పోర్ట్ విషయానికి వస్తే.. మన దేశం ఈ జాబితాలో 84వ స్థానంలో నిలిచింది. భారతీయులు ముందస్తు వీసా లేకుండా 55 గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు. అల్జీరియా, మౌరిటానియా కూడా ఇదే ర్యాంక్‌లో ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లో భారత్ 85వ స్థానంలో ఉండగా, ఈసారి ఒక స్థానం మెరుగుపడింది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. ర్యాంక్ పెరిగినప్పటికీ భారతీయులు ప్రయాణించగల గమ్యస్థానాల సంఖ్య మాత్రం తగ్గింది. 2025 అక్టోబర్‌లో 57గా ఉన్న ఈ సంఖ్య తాజా జాబితాలో 55కు చేరింది. అంటే ర్యాంకింగ్‌లో స్వల్ప పురోగతి కనిపించినా, ప్రయాణ అవకాశాల పరంగా మాత్రం తగ్గుదల నమోదైంది.

మరోవైపు ప్రపంచంలో పాస్‌పోర్టుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ కూడా ఉంది. అయితే ఇది హెన్లీ ఇండెక్స్‌కు భిన్నంగా పనిచేస్తుంది. ప్రయాణ స్వేచ్ఛతో పాటు పెట్టుబడి అవకాశాలు, జీవన ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అందుకే ఈ రెండు ఇండెక్స్‌లలో దేశాల ర్యాంకులు వేర్వేరుగా ఉంటాయి.

Tags:    
  • henleypassportindex 
  • indianpassport 
  • passportranking2026 
  • singaporepassport 

Similar News

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

2026-11-11 01:42 GMT

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

దుబాయ్‌లో 24 క్యారెట్ల బంగారు నడకదారి.. 2026లో మరో అద్భుత ఆకర్షణ!

2026-10-27 04:59 GMT

ట్రైన్ జర్నీలో వీడియోలు చూసే అలవాటుందా? మిస్ కావొద్దు

2026-10-20 05:58 GMT

ఇంధన ధరల మోతతో ఇండిగో ఛార్జీలకు రెక్కలు.. ఎంతంటే?

2026-10-06 04:48 GMT

విదేశీ ట్రావెల్ ఇక రిచ్‌లకే కాదు.. మిడిల్ క్లాస్ డ్రీమ్ నిజం అవుతోంది

2026-09-27 02:30 GMT

మేఘాల కొండ...అదో అందమైన గమ్మత్తు !

2026-09-18 08:30 GMT

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. స్మార్ట్‌ఫోన్ బోర్డింగ్ పాస్ చాలు!

2026-08-22 14:30 GMT

Gen Z ట్రావెల్ ట్రెండ్.. రూల్స్ బ్రేక్ చేస్తుందా?

2026-04-24 23:30 GMT

భూమిపై అతి సుందర ప్రదేశం స్పిటీ వ్యాలీ.. అక్కడ ప్రకృతి ఎలా ఉంటుందంటే?

2026-04-07 07:30 GMT

భారత పాస్‌పోర్ట్ కి 75వ స్థానం.. ఈ ర్యాంకింగ్ తో ఎన్ని దేశాలు తిరగచ్చో తెలుసా?

2026-02-13 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS