కేటీఆర్ ను పక్కన పెట్టేసుకొనే ఆ మాట అనేశాడే
తెరలు తొలుగుతున్నాయా? ఇంతకాలం కేటీఆర్ పరోక్షంలో ఆయన్ను పొగిడేస్తున్న గులాబీ నేతలు.. ఇప్పుడు ఆయన ముందే పొగడ్తల దుకాణాన్ని తెరిచేశారా? అంటే అవునని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని ఇటీవల కాలంలో పలువురు టీఆర్ఎస్ మంత్రులు వ్యాఖ్యానించటం తెలిసిందే. అయితే.. ఆ వ్యాఖ్యలకు మీడియా నే కారణమని.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమం లో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారే తప్పించి.. ఎవరేమన్నా.. మరికొన్నేళ్ల పాటు తమ ముఖ్యమంత్రి కేసీఆరేనని కేటీఆర్ చెప్పుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా మంత్రి గంగుల కొత్త కల్చర్ కు తెర తీశారు. ఇంతకాలం కేటీఆర్ పరోక్షంలో ఆయన్ను ఆకాశానికి ఎత్తేసే తీరుకు భిన్నంగా.. ఆయన ముందే ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని.. కేసీఆర్ దేశానికి కాబోయే ప్రధానిగా ఆయన అభివర్ణించారు. గంగుల నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చిన సమయంలో.. ఆయన మాటల్ని వింటూ కామ్ గా ఉండిపోయారు కేటీఆర్.
అధినేత కేసీఆర్.. కాబోయే అధినేత కేటీఆర్ మనసు దోచుకునేలా మరిన్ని వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల. బెంగాల్ లో కమ్యూనిస్టులు చాలా ఏళ్లు పాలించారని.. వారి తర్వాత తృణమూల్ కాంగ్రె్‌సకు అధికారం వచ్చిందని.. రాబోయే నలభై ఏళ్లలో తెలంగాణలో టీఆర్ఎస్సే తప్పించి మరెవరూ అధికారంలోకి రాలేదన్నారు.
కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని దేశమంతా కోరుకుంటుందన్న పెద్ద మాటను కూడా గంగుల యథాలాపంగా చెప్పేశారు. నిజానికి కేసీఆర్ ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రజలకు తెలుసా? అన్నది మరో ప్రశ్న. ఇటీవల జరిగిన కార్పొరేషన్ల ఎన్నికల్లో తమ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ప్రతినిదులతో కలిసి మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గంగుల.. కొత్త తరహాలో పెద్ద ఎత్తున పొగడ్తల వర్షాన్ని కురిపించారు. గంగుల తీరుతో.. రానున్నరోజుల్లో మరికొందరు ఈ పొగడ్తల వ్యవహారాన్ని మరింత దూకుడుగా తీసుకెళ్లటం ఖాయమని చెప్పక తప్పదు.