మీరు చేసుకున్న పనే అంటూ .. ఫీల్డ్ అసిస్టెంట్లపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
మంచిగా వద్దు అని ఎన్నో సార్లు చెప్పిన, అందరినీ కూసోపెట్టి చెప్పిన, కానీ మీరు నా మాటలు పట్టనట్టు .. వినిపించుకోకుండా ఓవరాక్షన్ చేశారు. సీఎంకు కోపం వచ్చిందంటూ ఈజీఎస్ ఎఫ్ ఏ లపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ అయ్యారు. తమను డ్యూటీలోకి తీసుకోవాలంటూ పలు మండలాల ఈజీఎస్ ఎఫ్ ఏ లు ఆదివారం వరంగల్రూరల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి ఇంటి వద్ద ఆయనను కోరారు. ప్రభుత్వం ఉద్యోగాలను తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పలు కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మృతి చెందారని తెలిపారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూనియన్ లీడర్లు చేయబట్టే సమ్మెకు పోయి పిచ్చిపిచ్చి స్టేట్ మెంట్లు ఇచ్చి ఆయన అంతు చూస్తామనడంతో మీ మీద కోపం వచ్చిందన్నారు. తాను సీఎంతోటి మాట్లాడుతున్నానంటూ కాన్వాయ్లో వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎఫ్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల రవి తదితరులు పాల్గొన్నారు. రవి మాట్లాడుతూ .. సమ్మెను విరమిస్తే విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి ప్రస్తుతం మాట మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.