వేటు పడే తర్వాతి అధికారి ఎవరో చెప్పేసిన మంత్రి బొత్స

Update: 2020-02-11 05:04 GMT
వరుస పెట్టి సంచలన నిర్ణయాల్ని తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అవినీతి ఆరోపణలతో పాటు.. చేతిలో అధికారం ఉన్న వేళ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్న అధికారుల మీదా.. తమకున్న పవర్ ను సొమ్ము చేసుకున్న వారిపైన చర్యలకు ఉపక్రమించిన జగన్ సర్కారు తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.

తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు మీద సస్పెన్షన్ వేటు వేసింది ఏపీ సర్కార్. దీనిపై మొదలైన కలకలం ఒక కొలిక్కి రాక ముందే.. తర్వాత వేటు పడే అవకాశం ఉన్న అధికారి ఎవరన్న అంశంపై జోరుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటివేళ.. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చేశారు. ఏబీ తర్వాత వేటు పడే అవకాశం ఉన్నదెవరో వెల్లడించారు.

ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు.. ప్రస్తుతం మరో అధికారి మీద కూడా ఏపీ శాఖ విచారణ జరుపుతుందని.. దీనికి సంబంధించిన రిపోర్టును ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లుగా బొత్స వెల్లడించారు. మంత్రి చెప్పిన అధికారి ఎవరన్న విషయంలోకి వెలితే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పీఎస్ గా పని చేసిన శ్రీనివాస్ అయి ఉంటాని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. బొత్స చెప్పిన మాటల్లో నిజం ఉందన్న భావన కలుగక మానదు. గడిచిన ఐదు రోజులు గా బాబు మాజీ పీఎస్ ఇంట్లో ఆదాయపన్ను అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.

ఒక అధికారి ఇంట్లో ఇన్ని రోజుల పాటు ఐటీ అధికారులు తనిఖీలు జరపటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారిగా పలువురు చెబుతున్నారు. మంత్రి మాటల నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వర రావు తర్వాత వేటు పడేది కచ్ఛితంగా శ్రీనివాస్ మీదనేనని చెబుతున్నారు. అధికారుల మీద సస్పెన్షన్ వేటు పడినంతనే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేస్తుందన్న తెలుగు తమ్ముళ్లు.. కేంద్రం పరిధిలో ఉన్న ఐటీ శాఖ అధికారులు ఐదు రోజులుగా సోదాలు జరుగుతున్న వైనం పై ఎందుకు రియాక్ట్ కావటం లేదన్న బొత్స మాటల్లో అంతో ఇంతో పాయింట్ ఉందనే చెప్పాలి. ఇంతకూ శ్రీనివాస్ ఇంట్లో అంత భారీగా.. అన్నేసి రోజులు సోదాలు చేయాల్సిన అవసరం ఏమిటి? ఏమేం స్వాధీనం చేసుకున్నారన్న విషయం పై వివరాలు రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. శ్రీనివాస్ మీదనే చర్యల వేటుకు జగన్ సర్కారు రెఢీగా ఉన్న విషయాన్ని బొత్స క్లారిటీ గా చెప్పినట్లు గా చెప్పక తప్పదు.


Tags:    

Similar News