కరోనా నుంచి కోలుకున్నా మానసిక రుగ్మతలు.. పదేళ్ల పిల్లాడిలా ప్రవర్తిస్తున్న బాధితులు
కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కొంతమందిలో మానసిక సమస్యలు వస్తున్నాయని.. వారి మెదడు పనితీరు మందగిస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా మంది కరోనా నుంచి కోలుకున్నాక ఈ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కరోనా కోలుకున్న వారిలో కొంతమంది 10 ఏళ్ల పిల్లాడిలా ప్రవర్తిస్తున్నారట. లండన్ లోని ఇంపెరియల్ కాలేజీలో డాక్టర్ ఆడమ్ హాంప్‌షైర్ నేతృత్వంలోని వైద్యుల బృందం 84వేల మందిపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. కరోనా నుంచి కోలుకున్నాక వారు మానసికరుగ్మతలను ఎదుర్కొన్నారని పరిశోధకులు గుర్తించారు. వారు దీర్ఘకాలిక సమస్యలైన డిప్రెషన్ వంటి సమస్యలకు గురవుతున్నారని తేల్చారు.
మరికొందరిలో తీవ్రమైన ఒత్తిడి, మతిమరుపు వంటి లక్షణాలు బయటపడ్డాయి. అయితే మెదడు పనితీరు ఎలా ఉంది? వారిలో ఏమైనా మతిమరపు లక్షణాలు ఉన్నాయా? అని కొన్ని పరీక్షలు నిర్వహించారు. పదాలను గుర్తుపట్టడం లేదా పజిల్ పూర్తి చేయమనడం వంటి అనేక పరీక్షలు చేశారు. వారిలో మెదడు తాత్కాలికంగా బలహీనపడినట్టు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 84,285 మందిపై గ్రేట్ బ్రిటీష్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ద్వారా పరీక్షించింది. కరోనాతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నవారిలో సగటున 20ఏళ్ల వయస్సు నుంచి 70ఏళ్ల వయస్సు మధ్య వారి మెదడు వయస్సు 10ఏళ్ల వయస్సుకు సమానమని గుర్తించారు.