మీజిల్స్ వ్యాక్సిన్: పిల్లలను కరోనా నుంచి కాపాడుతోందట.!

Update: 2021-06-24 01:30 GMT
కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఐఐటీ నిపుణులు సెప్టెంబర్ లో వస్తుందని అంటున్నారు. అయితే పిల్లలకు చిన్నప్పుడు వేసే తట్టు (మీజిల్స్ ) వ్యాక్సిన్ ఇప్పుడు కరోనా నుంచి రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తోందని తాజా పరిశోధనలో తేలింది.

తాజాగా పూణేలోని బీజే మెడికల్ కాలేజీ ఈ మేరకు గుడ్ న్యూస్ చెప్పింది. చిన్నప్పుడు పిల్లలకు వేసే తట్టు (మీజిల్స్) టీకా కరోనా నుంచి వారిని రక్షిస్తున్నట్టు వీరి పరిశోధనలో తేలింది. ఒకవేళ ఈ వ్యాక్సిన్ వేసుకున్న పిల్లలకు కోవిడ్ సోకినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటున్నట్టు కూడా స్పష్టమైంది. కరోనా వైరస్ పై మీజిల్స్ వ్యాక్సిన్ 87.5 శాతం  సమర్థంగా పనిచేస్తున్న వెల్లడైందట..

పిల్లల్లో మీజిల్స్ వ్యాక్సిన్ కోవిడ్ నుంచి దీర్ఘకాల రక్షణ కూడా అందిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.పిల్లలకు మీజిల్స్ డోసు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని.. తొలి డోసు తీసుకున్న వారు తప్పనిసరిగా రెండో డోసు వేయించుకోవాలని డాక్టర్ నీలేశ్ సూచించారు.

ఇక తాజాగా మీజిల్స్ పై 548 మందిని రెండు గ్రూపులుగా విభజించి ఏడాదిపాటు పరిశోధనలు నిర్వహించారు. 17 ఏళ్ల వయసున్న వారిని  రెండు గ్రూపులుగా విభజించి ఏడాదిపాటు పరిశోధించారు. మీజిల్స్, బీసీజీ వ్యాక్సిన్లు కరోనా నుంచి పిల్లలకు రక్షణ కల్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా అధ్యయనం తేల్చింది.
Tags:    

Similar News