మసాలా కింగ్​ ఇకలేరు.. విభిన్నంగా నివాళి అర్పించిన అభిమానులు

Update: 2020-12-04 09:22 GMT
మసాలా అంటే చాలా మందికి గుర్తొచ్చేపేరు ఎండీహెచ్​ మసాలా.  ఆ మసాలా రూపకర్త, దాని యజమాని ధర్మపాల్​ (98) కన్నుమూశారు. ఈ ఎండీహెచ్ మసాలా ప్యాకెట్​ మీద ధర్మపాల్​ ఫొటో ఉంటుంది. అందుకే ఈ మసాలా వాడేవాళ్లందరికీ ఆయన తెలుసు. వయసుమీదపడటంతో అనేక రకాల ఆరోగ్యసమస్యలతో ఆయన బాధపడుతున్నారు. గురువారం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాసవిడిచారు.

వరుణ్ టండన్ అనే ఓ గ్రాఫిక్ డిజైనర్  ధర్మపాల్​కు వినూత్న రీతిలో నివాళి అర్పించారు. ఎండీహెచ్​ మసాలతోనే ఆయన ధర్మపాల్​ గులాచి చిత్రాన్ని రూపొందించారు. ఇందుకోసం ఆయన ఎనిమిది గంటలు శ్రమించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ సందర్భంగా డిజైనర్ వరుణ్ మాట్లాడుతూ.. తనకు ధర్మపాల్​ ఆదర్శమని చెప్పారు. వరుణ్​టాండన్​ గతంలోనూ పలువురు ప్రముఖులు చనిపోయినప్పుడు విభిన్నంగా వారి చిత్రాలను రూపొందించారు.  ధర్మపాల్ గులాటీపాకిస్థాన్ లోని సియాల్ కోట్ లో 1923లో జన్మించారు. ఆయన కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆయనకు ఊహతెలిసినప్పుడు అతడి కుటుంబ సభ్యులు ఢిల్లీకి వచ్చారు. మొదట్లో ధర్మపాల్ చిన్న బడ్డీ కొట్టును పెట్టుకున్నాడు. అక్కడ చిన్న చిన్న సరుకులు అమ్మేవాడు. అయితే అతడు సొంతంగా మసాలా ప్యాకెట్లు తయారు చేసి వాటిని విక్రయించేవాడు.

అతడు తయారుచేసిన మసాలకు కొద్దిరోజుల్లోనే విపరీతమైన క్రేజ్​ వచ్చింది. దీంతో మసాలాలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఎండీహెచ్​ మసాలా మనదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ సంస్థ ఓ ఏడాది టర్నోవర్​ రూ. 900 కోట్లు. అమెరికా, కెనడా,యూకేలోని ఇంగ్లండ్ , స్కాంట్లాండ్, జపాన్, యూఏఈ, సైదీ అరేబియా వంటి దేశాల్లో ఎండీహెచ్​ మసాలాకు మంచి పేరు ఉంది. ధర్మాపాల్​ వ్యాపారాల్లోనే కాక దానధర్మాల్లోనూ ముందుండేవారు. ‘మహాశయ్ చున్నీలాల్’ పేరుతో ఆయన ఓ ట్రస్ట్​ను ఏర్పాటు చేసి పేదలకు సాయం చేస్తున్నాడు. తన ఆదాయంలో 90 శాతం ఆయన సేవా కార్యక్రమాలకే వినియోగిస్తుంటారు. 2019లో కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్​ అవార్డునిచ్చి సత్కరించింది.
Tags:    

Similar News