అల్లుడితో అక్రమ సంబంధం.. అదెక్కడ వరకూ వెళ్లిందంటే?

Update: 2020-05-04 10:50 GMT
అక్రమ సంబంధాలు ఎప్పుడు ఎలా షురూ అవుతాయో అస్సలు అర్థం కాదు. ఆ కోవలోకే వస్తుందీ ఉదంతం. మన దేశంలో చోటు చేసుకోకున్నా.. ఊహించని ట్విస్టులు ఈ ఉదంతంలో కనిపిస్తాయి. మెక్సికోలో బయటకు వచ్చిన ఈ ఉదంతం ఆ దేశంలోని సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు తెర తీసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

మెక్సికోకు చెందిన లారెన్ అనే అమ్మాయి పాల్ అనే కుర్రాడితో ప్రేమలో పడింది. ఆ క్రమంలో వారిద్దరి మధ్య బంధం బలపడటమే కాదు.. పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది. కూతురు నిర్వాకం తెలిసిన తల్లి జూలీ చేసేదేమీ లేక.. వారిద్దరికి పెళ్లి చేసింది. పెళ్లి తర్వాత వారు ముగ్గురు కలిసి హనీమూన్ కు వెళ్లారు.

ఇక్కడే విషయం మరోలా మారింది. హనీమూన్ కు వెళ్లిన వేళ.. బిడ్డతో బయటకు వెళ్లిన సమయంలో అత్త జూలీ అల్లుడికి దగ్గరైంది. వారి మధ్య అనుబంధం మరో స్థాయికి వెళ్లింది. తర్వాత నుంచి సీన్ మారిపోయింది. భార్య దగ్గర ఉండాల్సిన భర్త.. అందుకు భిన్నంగా అత్తతో ఎక్కువగా ఉండటం షురూ చేశాడు. రాను రాను అత్తతో అల్లుడి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.

కూతురు లేని సమయాన్నిచూసుకొని అత్త.. అల్లుడు చెలరేగిపోయేవారు. వారిద్దరి మధ్య సాగుతున్న యవ్వారాన్ని కుమార్తె కంట పడింది. పాల్ ఫోన్ ను అనుకోకుండా చెక్ చేసిన సమయంలో.. తన తల్లితో భర్త చేసిన ఛాటింగ్ తో షాక్ తింది. అశ్లీలంగా ఉన్న ఆ ఛాటింగ్ తో విషయం అర్థమైంది. దీంతో.. వారిద్దరిని నిలదీసింది కుమార్తె. ఆ క్రమంలో మరో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అల్లుడితో ఉన్న సంబంధంతో అత్త గర్భవతి అయిన వైనం బయటకు పొక్కింది. ఈ ఉదంతం మెక్సికోలో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వారి యవ్వారం ఇప్పుడు వైరల్ గా మారింది.
Tags:    

Similar News