వాగు దాటుతున్న మావోయిస్టులు.... పోలీసుల డ్రోన్ వీడియో !
ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. అధిక సంఖ్యలో అటవీ మార్గం గుండా మరో ప్రాంతానికి తరలిపోతున్న దృశ్యాలను పోలీసులు సేకరించారు. డ్రోన్ కెమెరా ద్వారా ఈ వీడియో ను రికార్డ్ చేశారు. సుకుమా జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే అనుమానంతో అడవిలో కెమెరాతో నిఘా ఏర్పాటు చేయగా వారు ఓ వాగు దాటుతుండగా కెమెరాకు దొరికారు. కిస్తాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలోడి అటవీ ప్రాంతం నుంచి వీరు వెళ్తున్నారని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. సుమారు 200 మందికి పైగా మావోలు దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరంతా ఆయుదాలతో మకాం మార్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఇప్పటికే ఛత్తీస్ గఢ్ లో కొన్నిరోజులుగా పోలీసులు కూంబింగ్ పెంచడంతో తెలంగాణ వైపు వస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో బార్డర్ ఏరియాలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రాచలం, పినపాక, ములుగు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా ఈ స్థాయిలో కేడర్ ఉండటంతో పోలీసులు కూడా విస్తుపోతున్నారు. తెలంగాణలోనూ మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్నాయని కొన్ని రోజులుగా పోలీసులు ఏజెన్సీ ఏరియాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో మకాం వేసి పరిస్థితులను సమీక్షించిన సంగతి తెలిసిందే.