రక్షణ మంత్రి యుద్ధానికి రెడీ అవమంటున్నారు

Update: 2016-01-11 11:24 GMT
ఆర్మీ డే ఉత్సవాల్లో పాల్గొన్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యల్లో నిగూఢార్థాలు కనిపిస్తున్నాయి. శతృవులను సంహరించడంలో ఏమాత్రం కనికరం చూపించొద్దని... శతృవులకు బుద్ధిచెప్పడానికి రెడీగా ఉండాలని ఆయన సైన్యానికి సూచించారు. పటాన్ కోటను ఘటన నేపథ్యంలో ఆయన.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరులను జాతి గౌరవిస్తుందని, అయితే సైనికులు చేయాల్సింది ప్రాణత్యాగం కాదని, తమ ప్రాణాలను కోల్పోకుండా శత్రువులపై విజయం సాధించాలని అన్నారు.
   
ఒక్క సైనికుడు చనిపోయినా తనకు బాధగా ఉంటుందన్న ఆయన ''మీకు నష్టం కలిగిస్తున్నవారు మిమ్మల్ని ఎంత బాధకు గురి చేస్తున్నారనే విషయం గ్రహించలేనంత కాలం వారిలో మార్పు రాదు.  వారికీ అలాంటి నష్టం కలిగితే ఆ బాధ తెలుస్తుంది'' అన్నారు. శతృవులకు గుణపాఠం చెప్పాలన్నారు. ఆయన మాటలు వింటుంటే పాక్ తో ఏ క్షణమైనా యుద్ధానికి వెళ్తామని.. ధైర్యంగా ఉండి, వ్యూహాత్మక దాడులతో ప్రాణాలు పోగొట్టుకోకుండా పాక్ సైనికులను తుదముట్టించాలని పిలుపునిచ్చినట్లుగానే ఉంది.
Tags:    

Similar News