యూట్యూబ్ లో చూసి దొంగావతారం.. లోనిచ్చిన బ్యాంకుకే కన్నం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం బాగా అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ డేటా అందుబాటు ధరల్లోకి వచ్చాక మరింతగా సాంకేతికంగా ముందుకెళ్తున్నారు. అయితే ఈ సాంకేతికతను కొందరు చెడు పనులకు వినియోగించుకుంటూ పక్కదారి పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చూసి తుపాకులు తయారు చేయడం ఎలాగో నేర్చుకుంటున్నారు. ఏటీయం పగలగొట్టడం ఎలా, సారా తయారు చేయడం ఎలా.. అంటూ అన్ని యూట్యూబ్ లో చూసి నేర్చుకుని సులభమైన పద్దతుల్లో సంపాదిస్తూ చెడు మార్గాల్లోకి వెళ్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతూ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.
ఒడిశాలోని భువనేశ్వర్ లో ఓ యువకుడు రెడీమెడ్ బట్టల వ్యాపారం ప్రారంభించగా కరోనా లాక్ డౌన్ తో నష్టాలు వచ్చాయి. ఆ సమయంలో అతడు బ్యాంకు చోరీలు చేయడం మొదలు పెట్టాడు. చివరికి అతడు పోలీసులకు చిక్కగా యూట్యూబ్ లో దొంగతనం ఎలా చేయాలో చూసి బ్యాంకులను కొల్లగొట్టినట్లు సమాధానం ఇవ్వడంతో పోలీసులు నిర్ఘాంత పోయారు. భువనేశ్వర్ సమీపంలోని తంగిబంట గ్రామానికి చెందిన సౌమ్యరంజన్ జెనా అలియాస్ తులు రెండు బ్యాంకులలో రుణం తీసుకుని రెడీమెడ్ బట్టల వ్యాపారం ప్రారంభించాడు. అయితే అప్పుడే కరోనా మొదలై దుకాణాలన్నీ మూతపడ్డాయి. తులు అనుకోని నష్టాల్లో కూరుకుపోయాడు. అప్పుడే అతడు యూట్యూబ్ లో బ్యాంకులో దొంగతనం ఎలా చేయాలో చూసాడు. బొమ్మ తుపాకులతో జనాలు తక్కువగా ఉన్నపుడు హెల్మెట్ ధరించి బ్యాంకుల్లో ప్రవేశించి అక్కడి వారిని బెదిరించి దోపిడీలకు పాల్పడ్డాడు. కొద్ది రోజుల తర్వాత అతడు రుణం చెల్లించేందుకు దోపిడీ చేసిన బ్యాంకుకే రాగా అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సుధాంషు సారంగి తెలిపారు. నిందితుడి నుంచి 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.