రెచ్చిపోయిన మరో ప్రేమోన్మాది..తన లవర్ కి మరో లవర్ ఉన్నాడని..బ్లెడ్ తో గొంతు కోసేశాడు!

Update: 2021-02-25 17:30 GMT
ఈ మధ్య కాలంలో ప్రేమోన్మాదుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. కాలేజ్ లో ఇద్దరు ప్రేమించుకొని , ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కరోనా ఎంట్రీ ఇవ్వడం తో వారిద్దరూ దూరమైయ్యారు. ఫోన్ చేసిన యువతి రిప్లై ఇవ్వలేదు దీనితో పిచ్చ కోపంలో ఉన్నాడు. ఈ సమయంలో నీ లవర్ ఇంకొకడితో క్లోజ్ గా మూవ్ అవుతుంది అనే వార్త తెలియడంతో తట్టుకోలేక వెళ్లి ఆ అమ్మాయి గొంతు కోసేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే .. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా  లోని శివంతిపట్టి ప్రాంతంలో బాలక్రిష్ణన్ అనే ఓ యువకుడు ఉంటున్నాడు. తిరునల్వేలి పట్టణంలోని పలయం కోటై ప్రాంతంలోని ఓ ప్రముఖ కాలేజ్ లో డిగ్రీ చదివి పూర్తి చేశాడు. అదే కాలేజ్ లో చదివే సమయంలో అదే కాలేజ్ లో చదువుతున్న తిరునల్వేలి పట్టణంలో నివాసం ఉంటున్న ఓ అమ్మాయితో  ప్రేమలో పీకల్లోతు మునిగిపోయాడు. ఇద్దరూ ఇష్టపడటంతో బాలక్రిష్ణన్, ఆ యువతి కాలేజ్ లో, బయట ప్రాంతాల్లో కలిసి తిరుగుతూ విహారయాత్రలకు వెలుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

కానీ , కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కాలేజ్ మూసి వేయడంతో  అమ్మాయి ఇంటికే పరిమితం అయ్యింది. ఆ అమ్మాయి తో మాట్లాడాలని బాలక్రిష్ణన్ అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రియుడు బాలక్రిష్ణన్ తో అమ్మాయి  ఒక్కసారి కూడా మాట్లాడలేదు. బాలక్రిష్ణన్ ఫోన్ చేసినా అమ్మాయి మాత్రం ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. అప్పుడే బాలక్రిష్ణన్ కు ఓ వార్త తెలిసింది. నీ ప్రియురాలు   మరో యువకుడితో కలిసి తిరుగుతోందని, నీ గర్ల్ ఫ్రెండ్ కు మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసిన స్నేహితుడు సమాచారం ఇవ్వడంతో పిచ్చి పీక్స్ కి చేరింది.

ఆ యువతి విషయం ఏదో ఒకటి తేల్చుకోవాలని ఆమె ఇంటి దగ్గరకు ఇటీవల బాలక్రిష్ణన్ వెళ్లాడు. విషయం తెలుసుకున్న  ఆమె కుటుంబ సభ్యులు బాలక్రిష్ణన్ కు వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. మరోసారి రాధా ఇంటి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించిన బాలక్రిష్ణన్ ను అతని స్నేహితులు అడ్డుకున్నారు.  ఆ తర్వాత  ఆ అమ్మాయి కాలేజ్ కు వెళ్లిందని తెలుసుకున్న బాలక్రిష్ణన్ కాలేజ్ దగ్గరకు  వెళ్లడంతో ,ఆ అమ్మాయి  కాలేజ్ లో మరో యువకుడితో చనువుగా ఉన్న విషయం కళ్లారా చూశాడు. నీతో మాట్లాడాలని బాలక్రిష్ణన్ ప్రియురాలు కు చెప్పాడు.

పక్కన కొత్త ఫ్రెండ్ ఉండటంతో రాధా బాలక్రిష్ణన్ తో మాట్లాడటానికి నిరాకరించింది. దీనితో  బాలక్రిష్ణన్ పట్టరాని కోపం తో  జోబులో ఉన్న పదునైన బ్లేడ్ తీసుకుని మెడ, గొంతు చెక్కేశాడు. గొంతు తెగిపోవడంతో ఆ అమ్మాయి  కుప్పకూలిపోయింది. అక్కడి నుండి  పారిపోవడానికి ప్రయత్నించిన బాలక్రిష్ణన్ ను సాటి విద్యార్థులు, కాలేజ్ సెక్యూరిటీ గార్డులు, స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కాలేజ్ లో ఉన్న వాళ్లు షాక్ అయ్యి ఆ యువతిని  తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు.
Tags:    

Similar News