లవ్వర్ ను ఫ్రెండ్ తో కలిసి రేప్ చేసి చంపేశాడు.. సూసైడ్ చేసుకున్నాడు

Update: 2020-08-31 16:02 GMT
ఇటీవల కాలంలో దారుణమైన నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహకు అందని రీతిలో.. మానవత్వానికి మాయని మచ్చలా మారుతున్న ఈ ఉదంతాలు ఇప్పుడు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా యాదాద్రి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కాటేపల్లికి చెందిన పాతికేళ్ల యువతిని అదే గ్రామానికి చెందిన రవి అనే అతనితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఆర్నెల్ల వరకు ఇద్దరు సన్నిహితంగా మెలిగారు.

ఆమె అవసరాల కోసం రవి మూడు.. నాలుగు సందర్భాల్లో మొత్తం రూ.3లక్షల వరకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే.. కొంతకాలంగా తనను దూరం పెట్టటాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. కోపం పెంచుకున్న రవి.. ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఇందుకు తన స్నేహితుడు రవితేజ సాయం కోరాడు. ఈ నెల 18న వలిపాష గుట్ట (వలిగొండ మండలం లింగరాజుపల్లి శివారులో ఉంటుంది) వద్దకు రావాలన్నాడు.

అతడి మాటల్ని నమ్మిన ఆ యువతి అక్కడకు వచ్చింది. అప్పటికే తన స్నేహితుడితో కలిసి ఉన్న రవి.. ఆమెతో మాట్లాడుతూ గుట్ట మీదకు తీసుకెళ్లాడు.అక్కడ ఆమెపై వారిద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని పొదల్లోకి తోసి.. పైన చెట్ల కొమ్మల్ని కప్పేశారు. అనంతరం తమ వాహనం మీద వెళ్లిపోయారు. యువతి కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. రవి సైతం కనిపించకపోవటంతో అతని తల్లిదండ్రులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ షురూ చేసిన పోలీసులకు రవితేజను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో కుళ్లిపోయిన దశలో యువతి డెడ్ బాడీతో పాటు.. రవి డెడ్ బాడీని కూడా గుర్తించారు. ప్రియురాలిని దారుణంగా చంపేసిన తర్వాత.. పోలీసులకు పట్టుబడతానన్న భయంతో రవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రవితే. విచారణలో వెల్లడించాడు. తాము చేసిన దారుణాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో.. అతన్ని రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది. 
Tags:    

Similar News