లాక్ డౌన్ :మద్యం దొరక పోవడంతో ఐసో ప్రొపిల్ ఆల్కహాల్ తాగారు..?
కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్రం లాక్ డౌన్ విదిస్తే ... మందుబాబులు మద్యం దొరక్క అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రాణాలమీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దొరకలేదని ఆరుగురు యువకులు శానిటైజర్‌లో వినియోగించే ఐసో ప్రొపిల్ ఆల్కహాల్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ధర్నాల నవీన్ మూర్తిరాజు, అదే గ్రామానికి చెందిన అల్లాడి వెంకటేష్, ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన పండూరి వీరేష్, ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన తణుకు దుర్గారావు, విప్పర్తి శ్యాంసుందర్, ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన కావలిపురపు వెంకటదుర్గాప్రసాద్ స్నేహితులు. వీరికి మద్యం అలవాటు ఉండటంతో కొన్ని రోజులుగా మద్యం దొరకక పోవడంతో అనేక విధాలుగా మద్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
వీరిలో పండూరి వీరేష్ తణుకు మండలం పైడిపర్రులో అంబికా కెమికల్స్‌లో పని చేస్తున్నాడు. ఈనెల 29వ తేదీ ఆదివారం ఏలూరు నుంచి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం లోడ్ వచ్చింది. టిన్నులు దించడానికి వీరేష్‌ను యజమాని తమ్మయ్యనాయుడు పిలిపించారు. ఆదివారం ఉదయం లోడ్ దించిన తర్వాత అక్కడే శానిటైజర్ లో ముడిపదార్థంగా ఉపయోగించే ఐసో ప్రొపిల్ ఆల్కహాల్ ను 400 మిల్లీ లీటర్లు బాటిల్ లో వీరేష్ పట్టుకెళ్లాడు. ఆ తరువాత అందరికి కాల్ చేసి , శానిటైజర్ తయారు చేసుకుందాం రావాలి అని పిలిచాడు. దీనితో ఆరుమంది యువకులు కావలిపురం చెరువు దగ్గర కలుసుకుని మాట్లాడుకున్నారు. మద్యం దొరక్కపోవడంతోపాటు తీసుకువచ్చిన రసాయనం మందు వాసన వస్తుండటం..అప్పటికే మద్యం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుండటంతో దాన్ని స్ప్రైట్‌లో కలుపుకుని తాగారు. వీరిలో ధర్నాల నవీన్‌బాబు, వెంకటేష్, వీరేష్ ఎక్కువ మోతాదులో తాగారు. దుర్గారావు, దుర్గాప్రసాద్, శ్యాంసుందర్ భయంతో కొంచెం తాగారు.
ఆ తరువాత అందరూ తమ తమ ఇళ్లకి వెళ్లిపోయారు. మరుసటి రోజు నవీన్ మూర్తిరాజు పరిస్థితి విషమిచండంతో తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడు. వెంకటేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం చేరడంతో ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వీరేష్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. దీనితో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాపు చేపట్టారు.