ఇప్పటికీ కోలుకోని 'ఎల్జీ పాలిమర్స్' గ్యాస్ బాధితులు..!
విశాఖపట్నంలో విషవాయువు మిగిల్చిన విషాధ గీతికలు ఇంకా మన కళ్లముందే ఉన్నాయి. విశాఖలోని 'ఎల్జీపాలిమర్స్' పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన సంఘటన జరిగి ఆరు నెలలవుతోంది. అయితే ఈ సంఘటన నుంచి ఇంకా విశాఖ ప్రజలు కోలుకోవడం లేదు. ఈ ఏడాది మే 7వ తేదీన విశాఖ పట్నంలోని 'ఎల్జీపాలిమర్స్' నుంచి గ్యాస్ లీకై దాదాపు 10 మంది వరకు చనిపోయారు. ఎంతో మంది అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ ప్రమాదం జరిగే అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా 'ఎల్జీపాలిమర్స్' నుంచి స్టైరీన్ గ్యాస్ లీకైంది. అయితే కరోనాకు వేసే మందు అనుకొని అందరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ గుర్తించిన కొందరు తేరుకునేలోపే పెద్ద ప్రమాదం సంభవించింది. గ్యాస్ పీల్చుకున్న వారు ఎక్కడికక్కడే పడిపోయారు. వీరిలో ఎక్కువ శాతం మహిళలు, పిల్లలు ఉండడం ఆవేదనకు గురి చేసింది.
'ఎల్జీపాలిమర్స్' గ్యాస్ లీకైన ప్రభావం ఐదు గ్రామాలపై పడింది. వాటిలో పద్మనాభాపురం, వెంకటాపురం, కంపరపాలెం, నందమూరి నగర్, ఎస్సీ, బీసీ కాలనీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో గ్యాస్ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గ్యాస్ లీకైన సంఘటనపై ప్రభుత్వం నీరబ్‌కుమార్ నేతృత్వంలో ఓ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు నెలల విచారణ చేపట్టి 319 ఏజీల నివేదికను ప్రభుత్వానికి అందింది. నివాస ప్రాంతంలో ఉన్న ఈ గ్యాస్ క్షేత్రాన్ని ఇతర ప్రదేశంలోకి మార్చాలని సూచించింది.
సాధారణగా స్టైరీన్ గ్యాస్ 5 పీపీఎం(పార్ట్స్ ఫరల్ మిలియన్) స్థాయివరకు ప్రమాదం కాదు. కాని ప్రమాదం జరిగిన రోజు 300 నుంచి 500 పీపీఎం వరకు ఈ రసాయనం విడుదలై ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇది చాలా ప్రమాదకరమైనదని ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ, రసాయన శాస్త్రవేత్త జి. నాగేశ్వర్‌రావు తెలిపారు. స్టైరీన్ వాసన పెట్రోల్‌ను పోలి ఉంటుంది. దీంతో పెట్రల్ వాసన అనుకునే చాలా మంది ఈ వాసనను పీలుస్తుంటారు. దీంతో అప్పుడు ప్రమాదం కాకపోయినా దీర్ఘకాలికంగా మాత్రం వ్యాధులు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా గర్భిణులపై ఈ గ్యాస్ తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అంటున్నారు.
విశాఖ ప్రమాదం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా 'ఎల్జీ పాలిమర్స్' గ్యాస్ క్షేత్రం ఉన్న చుట్టుపక్కల వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఏ కొంచెం కొత్త స్మెల్ వచ్చినా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. మళ్లీ గ్యాస్ లీకవుతుందేమోననే భయంతో ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని వస్తువులు ఇతరులు కొనడం లేదు. గ్యాస్ ప్రదేశంలోని గ్రామం పేరు చెప్పగానే జంకుతున్నారు. దీంతో ఆరోగ్యాంగానే కాకుండా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటున్నామని బాధితులు ఆందోళన చెందుతున్నారు.