టీడీపీ జోరు.. వైసీపీ నుంచి నేత‌ల క్యూ!

Update: 2021-12-06 08:59 GMT
ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పుంజుకుంటోంది. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల్లో ఘోర‌ప‌రాజ‌యం త‌ర్వాత‌.. పార్టీలో ఒక‌విధ‌మైన నైరాశ్యం నెల‌కొంది. ఎక్క‌డిక‌క్క‌డ‌.. నాయ‌కులు.. పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్ప‌టికి రెండు న్నరేళ్లు టీడీపీలో వాతావ‌ర‌ణం స్త‌బ్దుగా ఉంది. దీంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహాల‌పై వ్యూహాలు ప‌న్నుతూనే ఉన్నారు.

పార్టీని బ‌లోపేతం చేయాల‌ని.. మ‌ళ్లి పుంజుకునేలా చేయాల‌ని.. ఆయ‌న ప్ర‌య‌త్ని స్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇప్పు డు పార్టీలో కొత్త ఉత్తేజం క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో టీడీపీకి అనుకూలంగా ప‌లుచోట్ల ఫ‌లితం వ‌చ్చింది. దీంతో పార్టీ పుంజు కుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. చాలా చోట్ల‌.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక ల‌లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది.

దీంతో టీడీపీలో స‌రికొత్త ఉత్సాహం క‌నిపిస్తోంద‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు.. పార్టీ అధినేత చేస్తున్న పోరాటం.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ నాయ‌కుల దూకుడు క‌లిసి వ‌చ్చి.. టీడీపీని మ‌రింత‌గా ప‌రుగులు పెట్టిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్రమంలోనే టీడీపీలోకి వలసలు కూడా పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం లోని సౌదరదిన్నె గ్రామానికి చెందిన 150 వైసీపీ కుటుంబాలు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.

జగన్ పాలనలో ప్రజలు విసుగు చెందారని, వైసీపీ ప్రభుత్వానికి జనం చరమగీతం పాడతారని బీసీ జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఇక‌, అనంత‌పురంలోనూ కొన్ని రోజుల కింద‌ట‌.. తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి స‌మ‌క్షంలో 100 మంది వైసీపీ కార్య‌కర్త‌లు.. టీడీపీలో చేరారు.

అదేవిధంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులోనూ.. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు నేతృత్వంలో కొంద‌రు వైసీపీ నుంచి వ‌చ్చి సైకిల్ ఎక్కారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ పున‌ర్ వైభ‌వం దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News