వింత వ్యాధి రోగుల రక్తంలో సీసం...ఎలా వచ్చింది?
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వ్యాపిస్తున్న వింత వ్యాధి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచ దేశాలు....కొత్త వ్యాధి అనగానే బెంబేలెత్తుతున్నారు. కరోనా తరహాలో మరో మహమ్మారి కట్టలు తెంచుకోకుండా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే, ఏలూరులో ప్రజలకు సోకిన వింత వ్యాధికి గత కారణాలేమిటన్నది ఇప్పటివరకు అంతుచిక్కలేదు. మున్సిపాలిటీ నుంచి వచ్చిన త్రాగునీరు కలుషితమైనందునే ఈ వ్యాధి వచ్చిందని కొందరు, సమీపంలోని పొలాల్లో రసాయనాల వల్ల నీరు కలుషితమైందని మరి కొందరు అంటున్నారు. కల్తీపాలు కూడా ఈ పరిస్థితికి కారణమని కొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వింత వ్యాధికి సంబంధించిన కీలక పురోగతి లభించిందని పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు.
రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో అధిక మోతాదులో సీసం, నికెల్ లోహాల అవశేషాలు ఉన్నట్లు తేలిందని, సీసం కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తున్నట్టు ఢిల్లీలోని ఎయిమ్స్ శాస్త్రవేత్తలు, వైద్యులు అనుమానిస్తున్నారని శుక్లా తెలిపారు. తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలోకి ఈ లోహాల అవశేషాలుండవచ్చని, వింత వ్యాధికి ఇది ఒక కారణం కావచ్చని వారు అనుమానిస్తున్నారని, అందుకే ఏలూరులోని తాగునీరు, పాల నమూనాలతోపాటు మరింత మంది రోగుల రక్త నమూనాలను ఢిల్లీలోని ఎయిమ్స్ నిపుణులు మరింత లోతుగా అధ్యయనం చేయబోతున్నారని తెలిపారు. రక్తంలోకి సీసం, నికెల్ లోహాల అవశేషాలు ఎలా వచ్చాయన్నదానిపై వైద్యులు పరిశోధన చేస్తున్నారని అన్నారు. అయితే, నీరు, పాల ద్వారా ఆ అవశేషాలు రక్తంలోకి రాలేదని ప్రాథమిక అంచనాకు వచ్చామని, కూరగాయలు, స్వీట్లు ద్వారా ఆ లోహాలు రక్తంలోకి వచ్చాయేమో అన్న కోణంలో పరిశీలిస్తున్నామని శుక్లా తెలిపారు.
తాగునీటిలో భార లోహాలు, విషపూరిత రసాయనాలు కలవడమే ఈ వింత వ్యాధికి కారణం కావొచ్చని భావిస్తున్నట్టు మంగళగిరిలోని ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ కక్కర్ కూడా పేర్కొన్నారు. వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణమయ్యే అవకాశాలు తక్కువని ఆయన తెలిపారు. ఏలూరులో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి తాగునీటి నమూనాలు, అస్వస్థతకు గురైన వారి నుంచి రక్తం, మూత్రం, వెన్నెముక నుంచి తీసిన ద్రవాల (సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్) నమూనాల్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కి పంపించినట్టు చెప్పారు. తాగునీటిలో సీసం, ఆర్గానో క్లోరిన్ వంటివి మోతాదుకి మించి కలవడం వల్ల ఈ తరహా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. పొలాల్లో రైతులు వాడే క్రిమిసంహారకాల వల్ల కూడా నీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు.
కొద్ది రోజుల క్రితం కుళాయిల్లో రంగుమారిన నీరు వచ్చిందని స్థానికులు చెప్పారన గుర్తు చేశారు. ఇప్పటికే నీరు, పాలు, కూరగాయలవంటి వివిధ శాంపిళ్లను పుణె ల్యాబ్ కు, ఢిల్లీ ఎయిమ్స్ కు, హైదరాబాద్ లోని సీసీఎంబీకి, ఎన్ ఐఎన్, ఐసీఎంఆర్ పంపామని ఏపీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ గీత అన్నారు. అయితే, ఈ వ్యాధి సోకడానికి గల కారణాలపై ఇంకా అధికారికంగా ప్రభుత్వం, వైద్యాధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. సీసీఎంబీ నివేదిక వస్తే మరింత స్పష్టత రావచ్చని చెప్పారు. 551 మంది ఈ వ్యాధి బారిన పడగా 341 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.