పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్..రేసులోనే రాజస్థాన్
ఐపీఎల్లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జూలు విదిల్చింది. కింగ్స్ లెవెన్ పంజాబ్ పై చక్కటి విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలిచింది. బెన్ స్టోక్స్, సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించారు. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. కాగా పంజాబ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ (99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. అతడి శ్రమ వృథా అయ్యింది. వరుసగా విజయాలు సొంతం చేసుకుంటూ ముందుకెళ్తున్న పంజాబ్ కు రాజస్థాన్ కళ్లెం వేసింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్ గేల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులతో 99), చెలరేగగా కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) రాణించాడు.
అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ సమష్టిగా ఆడటంతో 17.3 ఓవర్లలోనే 186 పరుగులు సాధించి విజయం అందుకున్నారు.బెన్ స్టోక్స్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), సంజూ శాంసన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) బౌండరీల మోత మోగించారు. ఆఖర్లో స్టీవ్ స్మిత్(20 బంతుల్లో 5 ఫోర్లు 31 నాటౌట్), జోస్ బట్లర్ (11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) అద్భుతంగా ఆడి రాజస్థాన్ కు విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో అశ్విన్, జోర్డాన్‌లకు చెరొక వికెట్ దక్కింది. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకోగా రాజస్థాన్ మాత్రం ముందడుగు వేసింది.రాబిన్ ఉతప్ప(30) మంచి పరుగులు చేశాడు.
ఒక్క పరుగు తేడాతో గేల్ సెంచరీ మిస్
ఈ మ్యాచ్ లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అదరగొట్టాడు. షేక్ జాయెద్ స్టేడియంలో సిక్స్‌ల వర్షం కురిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రెండు లైఫ్‌లు దొరకడంతో వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 63 బంతుల్లో 99 పరుగులు బాదేశాడు. ఇందులో 8 సిక్స్‌లు, 6ఫోర్లు ఉన్నాయి. ఇక ఒక్క పరుగు చేస్తే సెంచరీ ఖాయం అనుకోగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో గేల్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్లో మూడో బంతికి సిక్స్ కొట్టిన గేల్ ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బోల్డ్ అయ్యాడు.ఒక పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యిందన్న ఫ్రస్ట్రేషన్‌లో గేల్ బ్యాట్‌ని విసిరికొట్టాడు.