అమెరికా ఎన్నికల్లో కేటీఆర్ ప్రచారం!
హెడ్డింగ్ చూస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అది నిజ్జంగా నిజమే. చిరంజీవి లాంటి ఫెయిల్యూర్ పొలిటీషియన్ కర్ణాటకలో.. తమిళనాడులో తెలుగు వాళ్లు ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినపుడు.. కేటీఆర్ లాంటి సక్సెస్ ఫుల్ నాయకుడు అమెరికాలో తెలంగాణ ఎన్నారైలు ఉన్న ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేయడంలో ఆశ్చర్యమేముంటుంది చెప్పండి. కొన్నిసార్లు ఒకట్రెండు ఓట్లు కూడా ఫలితాల్ని మార్చేస్తుంటాయి. అందులోనూ గత కొన్నేళ్లలో అమెరికాలో ప్రవాస భారతీయ ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. వారి ప్రాబల్యమూ బాగా ఎక్కువైంది. మన వాళ్లు అక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేంత స్థాయికి ఎదిగారు. అందుకే అక్కడి రాజకీయ పార్టీలు మన ఎన్నారైలకు బాగా ప్రాధాన్యమిస్తున్నాయి.
ఇటీవలే కేసీఆర్ అమెరికాలో పర్యటించగా.. అధికార డెమొక్రటిక్ పార్టీతో పాటు ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ నాయకులు చాలామంది ఆయన్ని కలిశారు. తమ ఎజెండాల గురించి.. ప్రవాస భారతీయుల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగానే తెలంగాణ ఎన్నారైల్లో కేటీఆర్ కు ఉన్న ఆదరణ గురించి తెలుసుకుని.. ఆయనతో ప్రచారం చేయించే విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అక్టోబర్లో అమెరికా ఎన్నికల ప్రచారం జోరందుకోబోతున్న సమయానికి కేటీఆర్ ను అక్కడికి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేటీఆర్ కూడా అందుకు ఆసక్తిగానే ఉన్నాడట. కాబట్టి అమెరికా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న ఇండియన్ లీడర్ గా ఘనత వహించబోతున్నాడన్నమాట కేటీఆర్.