కేటీఆర్ సాయమడిగారు..మోదీ చేస్తారంటారా?
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో రాష్ట్రం గురించి అంతగా పట్టించుకోనట్టుగా కనిపించిన కల్వకుంట్ల తారకరామారావు... తండ్రి కేబినెట్ లో వరుసగా రెండో సారి మంత్రిగా పదవీ బాద్యతలు స్వీకరించగానే... తెలంగాణకు నిధులు సాధించేందుకు రంగంలోకి దిగేశారు. హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటు కానున్న ఫార్మా సిటీ (నిమ్జ్)కు దాదాపుగా రూ.3,500 కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు కేటీఆర్ ఒకేసారి రెండు లేఖలు రాశారు. కేసీఆర్ సర్కారుతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారు... కేటీఆర్ లేఖలను బుట్టదాఖలు చేస్తుందని చెప్పలేం గానీ... కేటీఆర్ కోరిన మేరకు సాయం ఎప్పుడు చేస్తారు? అసలు చేస్తారా? లేదా? అన్న విషయాలపై ఇప్పుడు పెద్ద చర్చకే తెర లేసిందని చెప్పాలి.
కేటీఆర్ సదరు లేఖలను ఎవరెవరికి రాశారన్న విషయానికి వస్తే.. మోదీ సర్కారులో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ తో పాటుగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న దర్మేంద్ర ప్రదాన్ లకు కేటీఆర్ ఈ లేఖలు రాశారు. తెలంగాణలో ఏర్పాటు కానున్న ఫార్మా సిటీని కేంద్రం కూడా గుర్తించిందని - అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న ఫార్మా సిటీతో ఈ రంగంలో దేశాన్ని అంతర్జాతీయంగా ఓ సమున్నత స్థానంలో నిలుపుతుందని కేటీఆర్ సదరు లేఖలో చెప్పుకొచ్చారు. జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్ (నిమ్జ్)గా కేంద్రం గుర్తించిన నేపథ్యంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.3,500 కోట్లు ఇవ్వాల్సి ఉందన్న విషయాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఫార్మా సిటీ పూర్తి అయితే జాతీయ - అంతర్జాతీయ సంస్థలు సిటీలో పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తిగానే ఉన్నాయని, ఏకంగా రూ.65 వేల కోట్ల మేర పెట్టుబడులు కూడా రానున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఫార్మా సిటీ పూర్తి అయితే 5.6 లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుందని కూడా కేటీఆర్ తెలిపారు.
గతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలోనూ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన కేటీఆర్... ఇప్పుడు కూడా మంత్రి పదవి రాగానే మరోమారు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు రంగంలోకి దిగిపోయారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ తో మోదీ సంబంధాలు అంత బాగా లేవనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల సమయంలో కేసీఆర్ తీసుకున్న స్టాండ్ తో మోదీ... టీఆర్ ఎస్ ను పక్కనపెట్టేశారన్న వాదన బలంగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సాయం కోరుతూ రాసిన లేఖలకు మోదీ బ్యాచ్ నుంచి ఆశించినంత మేర స్పందన రాకపోవచ్చన్న వాదన అయితే వినిపిస్తోంది. అదే సమయంలో నిమ్జ్ హోదా ఇచ్చిన ఫార్మా సిటీకి నిధుల విడుదలలో కేంద్రం శీతకన్నేయడం కూడా సాధ్యం కాదేమో. చూద్దాం... మరి కేటీఆర్ సాయం కోరుతూ రాసిన లేఖలకు మోదీ సర్కారు ఎలా స్పందిస్తుందో?