వైసీపీలోకి మాజీ మంత్రి కొప్పన

Update: 2017-02-14 08:29 GMT
ఏపీలో ప్రస్తుత టీడీపీ పాలన అద్భుతంగా ఉందంటూ చంద్రబాబు ఎంతగా గొప్పలు చెప్పుకొంటున్నా ఇతర పార్టీల్లోని సీనియర్ నేతలు మాత్రం అటువైపు ఆకర్షితులు కావడం లేదు. అందుకు మాజీ మంత్రి కొప్పన మోహనరావు తీసుకున్న నిర్ణయమే ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం సేవలందించిన కొప్పన తాజాగా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
    
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొప్పన మోహన్ రావు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ కు వచ్చిన మోహన్ రావును వైసీపీ అధినేత జగన్ సాదరంగా ఆహ్వానించారు. జగన్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ, దివంగత రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి, పేదల అభ్యున్నతి కోసం జగన్ చేస్తున్న పోరాటాల పట్ల ఆకర్షితుడినై వైసీపీలో చేరుతున్నానని చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తన జిల్లాలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
    
కాగా కొప్పన కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో అటవీశాఖ మంత్రిగా పని చేశారు. ఇప్పటికీ జిల్లాలో ఆయనకంటూ ఒక వర్గం ఉంది. కాంగ్రెస్ మాజీలను ఎన్నికల నాటికి ఎలాగైనా టీడీపీలోకి తెచ్చుకుని పార్టీని పూర్తిగా బలోపేతం చేయాలని చంద్రబాబు నానా పాట్లు పడుతున్న తరుణంలో ఒక సీనియర్ నేత ఇలా వైసీపీలో చేరడంతో విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News