కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి
అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ సహా కేంద్రం పథకాలు శుద్ధ దండగ అని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విమర్శలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షతో కాదు విచక్షణతో వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఆరోపణలు చేయడం తగదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై వేయడం తగదని కిషన్ రెడ్డి హితవు పలికారు.
తెలంగాణలో సచివాలయం కూల్చివేతపై ఉన్న శ్రద్ధ.. కరోనా వైరస్ పై దృష్టిపెడితే బాగుండేదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎంఐఎం మెప్పు కోసమే ప్రధాని మోడీపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు. కేంద్రాన్ని అనే హక్కు కేసీఆర్ కు లేదన్నారు.
కరోనా సాయంలో తెలంగాణకు కేంద్రం ఏం తక్కువ చేయలేదని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 1400 వెంటీలేటర్లు ఇచ్చామని .. కానీ 500 వెంటీలేటర్లు ఓపెన్ చేయలేదని తెలిపారు. ఇచ్చిన వనరులను ఎందుకు సద్వినియోగం చేసుకోరు అని ప్రశ్నించారు.
తెలంగాణకు 13.85 లక్షల ఎన్95 కిట్లు, 241 లక్షల పీపీఈ కిట్లు, 42 లక్షల హెచ్.సీ.క్యూ మాత్రలను తెలంగాణకు కేంద్రం అందజేసిందని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణకు ఉచిత బియ్యం, ఉపాధి, మహిళల జన్ ధన్ ఖాతాలకు రూ.666 కోట్లు ఖర్చు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేసీఆర్ ఎందుకు అమలు చేయరని.. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చరు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.