భారత్ ఉసేస్ బోల్డ్స్ విఫలమవుతారని ముందే తెలుసు : కేంద్రమంత్రి !

Update: 2020-05-04 17:30 GMT
గత కొన్ని రోజుల క్రితం  కర్ణాటక సంప్రదాయక క్రీడ కంబళ పోటీల్లో ఒకరు.. కాళ్లకు బూట్లు లేకుండా రోడ్డుపై మరొకరు తమ అసాధారణ పరుగుతో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అప్పుడు వారిద్దరిని భారత్ ఉసేస్ బోల్డ్ అంటూ ప్రశంసలు కురిపించారు. దీంతో భారత స్పోర్ట్స్‌ అథారిటీ వారికి అత్యవసర ట్రయల్స్‌ నిర్వహించగా.. ఒకరు మాత్రమే పాల్గొని అంచనాలను అందుకోలేకపోయారని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే, వారికి అత్యవసర ట్రయల్స్‌ నిర్వహించడం ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయమన్నారు.

కర్ణాటక సంప్రదాయక క్రీడ కంబళ పోటీల్లో బోల్ట్‌ కన్నా వేగంగా 100 మీ. దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తిచేసిన శ్రీనివాస్‌ గౌడ (కర్ణాటక), కాళ్లకు బూట్లు లేకుండా రోడ్డుపై 100మీ.ల దూరాన్ని 11 సెకన్లలోనే పూర్తి చేసిన మధ్యప్రదేశ్‌ కు చెందిన రామేశ్వర్‌ గుర్జార్ ‌లకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఆదరణ దక్కిన విషయం తెలిసిందే. ఆ సమయంలో  దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వారికి ట్రయల్స్‌ నిర్వహిస్తామని ప్రకటించింది. అవసరమైతే శిక్షణ కూడా ఇస్తామన్నారు. తాజాగా ఈ వ్యవహారం పై కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పరుగు వీరులు ఇద్దరిలో ఒకరు ట్రయల్స్‌ పాల్గొని విఫలమవ్వగా.. మరొకరు రాలేదన్నారు.

గుర్జార్‌ పరుగెత్తుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అప్పుడు నేను స్పందించకుండా ఉంటే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించేవారు. అతనికి ట్రయల్స్‌ నిర్వహించగా గుర్జార్‌ అతికష్టమ్మీద 12.9 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తిచేశాడు. ట్రయల్స్‌లో జూని యర్లతోనే పోటీపడ లేకపోయాడు. అతని వయస్సు 26 ఏళ్లు కాబట్టి ఇప్పుడు అతనికి కొత్తగా శిక్షణ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. కానీ ప్రజలకు తెలియదు కదా. అందుకే ట్రయల్స్‌ నిర్వహించాం అని , అంతర్జాతీయ స్ప్రింట్‌ ప్రమాణాలపై సరైన అవగాహన లేకుండానే అతను బోల్ట్‌ను మించగలడంటూ దేశమంతా నమ్మింది'అంటూ రిజిజు అన్నారు.

దేశంలో చాలా మందికి క్రికెట్‌ గురించి తప్ప ఇతర క్రీడలపై ఏమా త్రం పరిజ్ఞానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మద్దతు లభించడం లేదని నాకు ఫిర్యాదు చేస్తుంటారు. నిజానికి మన దేశంలో ఆటలపై చాలా తక్కువ పరిజ్ఞానం ఉంది అని, ఇక్కడి ప్రజలకు క్రికెట్‌ గురించి మాత్రమే తెలుసు. ఇతర ఆటల గురించి ఏమాత్రం పట్టించుకోరు అని మంత్రి రిజుజు ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News