మొన్న బయటకి వచ్చింది నకిలీ కిమ్ ?
ఉత్తరకొరియా నియంత కిమ్ జోన్ ఉన్ ఆరోగ్యం గురించి అంతర్జాతీయంగా మీడియాలో రెండు వారాలుగా రకరకాలు వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం కిమ్ ఒక్కసారిగా కన్పించకుండా పోయేసరికి ఆయనకు హార్ట్ సర్జరీ జరిగిందని, ఆయన కోలుకుంటున్నారని , చనిపోయారని ..ఇలా పలురకాల వార్తలు వచ్చాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ మే-1,2020న కిమ్ జోంగ్ ఉన్ ప్రజల మధ్యకు వచ్చాడు. రాజధాని ప్యాంగ్యాంగ్ కు సమీపంలో ఓ ఎరువుల ఫ్యాక్టరీని రిబ్బన్ కట్ చేసి కిమ్ ప్రారంభిన ఫొటోలు,వీడియోను ఆ దేశ మీడియా మే 2న విడుదల చేసిన విషయం తెలిసిందే దీంతో 20 రోజులుగా కనిపించకుండా పోయిన కిమ్... పబ్లిక్ లో ఒక్కసారిగా కనిపించి అందరి సైలెంట్ అయ్యారు.
అయితే, ఆ కార్యక్రమానికి వచ్చింది అసలు కిమ్ కాదని, ఆయన డూప్ అని కొందరు సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. కిమ్ జాంగ్ పాత ఫొటోలను, తాజా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తేడాలను చూపిస్తున్నారు. బ్రిటన్ మాజీ ఎంపీ లూయిస్ మెన్స్, గతంలోని కిమ్ చిత్రాన్ని, మొన్నటి చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, పాత కిమ్ పళ్ల వరుసకు, కొత్త కిమ్ పళ్ల వరుసకూ తేడా కనిపిస్తోందని చెప్పడంతో, ఈ విషయం వైరల్ అయింది. ఆయన హెయిర్ స్టయిల్ కూడా మారిందని అన్నారు.
కాగా, పలువురు దేశాధినేతలు... ముఖ్యంగా హిట్లర్, సద్దామ్ హుస్సేన్ వంటి వారు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు తమ నకిలీలలను పంపేవారన్న సంగతి తెలిసిందే. కిమ్ కూడా అలాగే భద్రతాపరంగా తనను పోలివుండే ఐదుగురిని వినియోగిస్తారని, ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తే, వారిలో ఒకరిని పంపిస్తారని కూడా వార్తలు వచ్చాయి. కిమ్ కు ఆపరేషన్ జరిగిందని, ఆయన ఆరోగ్యం క్షీణించి అంపశయ్యపై ఉన్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన బాగానే ఉన్నారని తెలియగానే, ఈ డూప్ వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి