ప్రియుడితో కలిసి భర్తను చంపి.. ఇంట్లోనే పూడ్చేసి సహజీవనం
గతంలో చాలా అరుదుగా మాత్రమే భర్తను చంపిన భార్య ఉదంతాలు చోటు చేసుకునేవి. ఇటీవల కాలంలో ఇలాంటి వైపరీత్యాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో చోటు చేసుకున్న ఉదంతం వింటే.. నోట మాట రాదంతే. ఇంత దారుణానికి బరితెగించిన వారికి ఎలాంటి శిక్ష వేసినా సరిపోదేమో? అన్న భావన కలుగక మానదు. ప్రియుడి మోజులో పడి భర్తను చంపేయటమేకాదు.. అతడ్ని ఇంట్లోనే పూడ్చి పెట్టేసిన దారుణం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఉదంతంలోకి వెళితే..
గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన చిరంజీవి ఈ మధ్యన కనిపించటం లేదు. మూడు నెలలుగా తన కొడుకు ఆచూకీ తెలీయటం లేదని.. చిరంజీవి తండ్రి సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో విచారణలోకి దిగిన పోలీసులు చిరంజీవి భార్య కొల్లూరుగ్రామానికి చెందిన ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే ఆమెను.. ఆమె సహజీవనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో.. పోలీసులు షాక్ తినే నిజాన్ని వారు బయట పెట్టారు.
చిరంజీవి మొదటి భార్యతో వివాదం రావటంతో కోర్టులో కేసు నడుస్తోంది. అదే సమయంలో ఇంటూరుకు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం చిరంజీవి పెళ్లి చేసుుకొన్నాడు. వీరికో బాబు కూడా పుట్టాడు. చిరంజీవికి చెరుకుపల్లికి సమీపంలో ఉన్న కొల్లూరులో మెడికల్ షాపు నిర్వహిస్తుంటాడు. అక్కడ తనకు పరిచయమైన వ్యక్తి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తితో చిరంజీవి రెండో భార్య చనువుగా ఉండేది. వారి మధ్యన వివాహేతర సంబంధం షురూ అయ్యింది.
ఇదిలా ఉండగా.. తన పేరుతో ఉన్న ఒక స్థలాన్ని చిరంజీవి అమ్మగా.. రూ.20లక్షలు వచ్చాయి. ఆ భారీ మొత్తాన్ని ఇంట్లో భద్రపరిచాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. గుట్టుచప్పుడుకాకుండా వారు అద్దెకుఉంటున్న ఇంట్లోనే పూడ్చి పెట్టారు. అనంతరం.. వారిద్దరు కలిసి కొల్లూరుకు మారి.. అక్కడ సహజీవనం షురూ చేశారు. ఎప్పుడైతే చిరంజీవి తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారో.. అప్పుడు రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగారు. దీంతో.. మొత్తం డొంక కదలటమేకాదు.. దారుణమైన వాస్తవాలు బయటకు వచ్చాయి. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు.