కేసీఆర్ యాడ్: భార్య ఒక్కతే.. భర్తలు వేరు..

Update: 2018-08-15 13:30 GMT
ఎంత ఘోరం.. ఎంత అపచారం.. చేసేది గొప్ప పని అయినా సరే.. చెప్పేది ఎంత నిక్కచ్చగా ఉన్న సరే.. కానీ ఇలాంటి అచ్చుతప్పులు మొత్తం మనం చెప్పాలనుకున్న థీమ్ నే దెబ్బతీస్తాయి.. తెలిసి చేశారో తెలియక చేశారో కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనల్లో పెద్ద తప్పు చేసింది. ఆగస్టు 15నుంచి రైతుబీమా - కంటివెలుగు లాంటి పథకాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నట్టు ఈరోజు అన్ని పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్ లు ఇచ్చింది. అంతా బాగానే ఉంది. కేసీఆర్ బాగా చేస్తున్నాడు.. నో డౌట్.. కానీ ఇక్కడే సదురు సమాచార శాఖ రూపొందించిన పత్రికా ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి..

తెలంగాణ ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు యాడ్ ఇచ్చింది. ఓ మహిళాతో రైతన్న ఉన్న ఫొటోను ప్రచురించింది. అంతవరకూ ఓకే.. ఇక ఇదే మహిళను రైతుబీమా కోసం వాడేశారు. కానీ అక్కడ భర్తను మార్చేశారు. మీ ప్రకటనల కోసం ఏకంగా మహిళా భర్తనే మార్చేస్తారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘భార్య ఒక్కతే.. భర్తలు వేర్వేరు.. భలే యాడు కొట్టారు బాస్’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేస్తున్నారు..

ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చే సమాచార - పౌరసరఫరాల శాఖ వారు ఈ యాడ్ ను రూపొందించారా.? లేక పత్రిక యాజమాన్యాలు రూపొందించాయో తెలియదు కానీ ఒక మహిళకు ఇద్దరు భర్తలను అంటగట్టి ఘోరమైన తప్పు చేశారు. ఇప్పుడా ప్రకటనలను బేస్ చేసుకొని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు చేస్తున్నారు.  ప్రకటనలు ఇచ్చేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోరా అని మండిపడుతున్నారు.
Tags:    

Similar News