కేసీఆర్ సంచలన నిర్ణయం.. బాటిల్స్ లో పెట్రోల్ సేల్ బంద్

Update: 2019-11-12 04:13 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనతో ప్రభావితమైన ఆయన.. ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పై.. తెలంగాణ రాష్ట్రం లో ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ పోసే పద్దతికి బంద్ చెబుతారు. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో వాహనాల్లో ఇంధనాన్ని నింపటం.. రిజర్వ్  గా ఉంచేందుకు ప్లాస్టిక్ బాటిళ్ల లో పెట్రోల్ పోయించు కొని ఉంచుకునే ధోరణి ఎక్కువ గానే కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు.. అనుకోని రీతిలో బండి లో పెట్రోల్ అయి పోతే.. ప్లాస్టిక్ బాటిల్ లో నింపుకొని వచ్చే అలవాటు ఎక్కువే.

ఇక పై అలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ బాటిళ్ల్లలో పెట్రోల్ పోయించు కునే అవకాశం ఉండదంటున్నారు. ఎందుకంటే.. వాహనాల్లో తప్పించి.. ప్లాస్టిక్ బాటిళ్ల లో పెట్రోల్ అమ్మకాల పై తెలంగాణ ప్రభుత్వం పరిమితులు విధించినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి చాలా బంకు ల్లో ప్రత్యేక బోర్డుల్ని ఏర్పాటు చేశారు.

ఇటీవల హైదరాబాద్ శివారు లోని హయత్ నగర్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి ని ఆమె పని చేస్తున్న ఆఫీసు లోనే బాటిల్లో పెట్రోలు తీసుకొచ్చి ఆమె మీద పోసి నిప్పు అంటించటం తో అక్కడికక్కడే సజీవ దహనమైన వైనం తెలిసిందే.
Read more!

ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం గా మారింది. ఈ ఘటన అనంతరం పెట్రోల్ బాటిళ్ల ను తీసుకొచ్చి వివిధ శాఖలకు చెందిన అధికారుల్ని బెదిరింపుల కు పాల్పడిన వైనాలు చాలా నే మీడియా లో దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యం లో ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు వీలు గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ లో ఏ పెట్రోల్ బంకు లోనూ ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ పోయరాదని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్లాస్టిక్ బాటిళ్ల లో పెట్రోల్ అమ్మ రాదన్న నిర్ణయం ఒక రకం గా చూస్తే మంచిదే అనుకుంటే.. మరి అత్యవసర పరిస్థితుల్లో బాటిల్ లో పెట్రోల్ తీసుకెళ్లే వారి సమస్యను ఎలా అధిగమించాలన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Tags:    

Similar News