కేసీఆర్ పీఆర్సీ గిఫ్ట్.. ఎంతుంటుంది?

Update: 2021-03-21 05:02 GMT
తెలంగాణలో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం దక్కడంతో అన్న మాట ప్రకారం ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ హామీని నెరవేర్చేందుకు కేసీఆర్ రెడీ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

పీఆర్సీ ప్రకటనకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ పై సమాధానం ఇచ్చే సమయంలో పీఆర్సీని ప్రకటిస్తారట..

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఐఆర్ కంటే ఒకటి రెండు శాతం అధికంగానే ఉంటుందని సమాచారం. దీంతో 29-30శాతం పీఆర్సీ వచ్చే అవకాశం ఉంది.

కాగా ఎంత పీఆర్సీ ఇస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందన్న లెక్కలను ఆర్థిక శాఖ వేస్తోంది. ఈ మేరకు కేసీఆర్ కు నివేదించినట్టు తెలిసింది.

ఇప్పటికే పీఆర్సీ కోసం బడ్జెట్ లో దాదాపు 8వేల కోట్లకు పైగా నిధులను కేటాయించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఉద్యోగుల పంట పడడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    

Similar News