కేసీఆర్ ప్రెస్ మీట్... ఈ ఒక్కటి మినహా అన్నీ పాతవే
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం మరోమారు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్, మినహాయింపులపై ఆయన చాలా విషయాలు చెప్పినా.. అందులో అన్నీ పాత విషయాలే ఉన్నాయని చెప్పక తప్పదు. అందులో ఉన్న ఒకే ఒక కొత్త విషయం ఏమిటంటే... లాక్ డౌన్ ను రాష్ట్రంలో ఈ నెలాఖరు (మే 31) దాకా పొడిగిస్తున్నట్లుగా ప్రకటించడమొక్కటేనని చెప్పాలి. గతంలో లాక్ డౌన్ ను మే 29 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పిన కేసీఆర్... ఈ సారి దానిని 31 దాకా పొడిగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక లాక్ డౌన్ లో మినహాయింపులపై కూడా కేసీఆర్ పాత విషయాలే ప్రస్తావించారని చెప్పక తప్పదు.
లాక్ డౌన్ ను మే 17 దాకా పొడిగిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటిస్తే... దానిని తెలంగాణలో మే 29 దాకా పొడిగిస్తున్నట్లుగా కేసీఆర్ గతంలో చెప్పారు. అయితే తాజాగా నాలుగో విడత లాక్ డౌన్ ను కేంద్రం ఈ నెలాఖరు దాకా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలోనూ నెలాఖరు దాకా లాక్ డౌన్ అమల్లో ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. ఇక మినహాయింపుల విషయానికి వస్తే... కంటైన్మెంట్ జోన్లతో సహా రాష్ట్రంలోని అన్ని జోన్లను గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తున్నట్టు కేసీఆర్ చెప్పాలి. సెలూన్లను జీహెచ్ ఎంసీ సహా అన్ని ప్రాంతాల్లో తెరచుకోవచ్చని కేసీఆర్ చెప్పారు. మంగళవారం ఉదయం నుంచి ఆర్టీసీ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్... జీహెచ్ ఎంసీ పరిధిలో సిటీ సర్వీసులకు మాత్రం నో చెప్పేశారు. ఇక జంట నగరాల్లో క్యాబ్, ఆటోలకు ఓకే చెప్పిన కేసీఆర్... క్యాబ్ ల్లో వన్ ప్లస్ త్రీ, ఆటోల్లో వన్ ప్లాన్ టూకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఆర్టీసీ సర్వీసుల విషయంలో కేసీఆర్ తనదైన శైలి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాలి. మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులను నడపనున్నట్లుగా ప్రకటించిన కేసీఆర్... అంతరాష్ట్ర సర్వీసులకు మాత్రం రెడ్ సిగ్నల్ వేశారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు నడపబోమని చెప్పిన కేసీఆర్... ఇతర రాష్ట్రాల బస్సు సర్వీసులను తెలంగాణలోకి అనుమతించబోమని తేల్చి చెప్పేశారు. ఇక మెట్రో రైల్ సేవలను కూడా ఈ నెలాఖరు దాకా నడిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మొత్తంగా ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్ వేసిన కేసీఆర్... అంతరాష్ట్ర సర్వీసులకు మాత్రం రెడ్ సిగ్నలే వేశారు.