పవన్ మా ఫ్రెండే..ఆయనకు వివరణ ఇస్తాం
టీడీపీ నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రోజుకో మాట మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న పవన్ ట్వీట్లపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పవన్ భూసేకరణ వద్దని చెపుతున్నందున ఆయన ఎక్కడ..ఎలాంటి భూసేకరణ చేయాలో చెపితే మంచిదని కాస్త వ్యగ్యంగా సెటైర్లు వేశారు. మరో మంత్రి నారాయణ కూడా ఇప్పటికే రాజధాని కోసం రైతులు 98 శాతం భూమి ఇచ్చినందున మిగిలిన వారు కూడా భూమి ఇవ్వాలని... వారు భూమి ఇచ్చేలా పవన్ చూడాలని ఆయన చాలా తెలివిగా పవన్ పైనే భారం నెట్టేశారు. నారాయణ మాటల్లో పవన్ భూసేకరణపై ఇంకా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్టుగా అర్థం ఉంది.
అయితే ఈ రోజు చంద్రబాబు మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ వ్యాఖ్యలపై ఎవ్వరు విమర్శలు చేయవద్దని చెప్పడంతో వారికి పరిస్థితులు జ్ఞానోదయం అయ్యాయి. పవన్ అర్థం చేసుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా అంటే ప్రభుత్వ ఛీప్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ పవన్ కు తమకు ఫ్రెండ్ అని...పవన్ తమ వద్దకు వచ్చి మాట్లాడినా...లేకపోయినా తామే ఆయన వద్దకు వెళ్లి పరిస్థితులు వివరిస్తామని చెప్పారు.
భూసేకరణ గురించి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత తమకు ఉందని...దీనిపై పవన్ ను కలిసి వివరణ ఇస్తామని కూడా ఆయన చెప్పారు. మొత్తానికి చంద్రబాబు పవన్ విషయంలో దూకుడు వద్దని వీరందరికి గట్టిగా క్లాస్ పీకినట్టు అర్థమవుతోంది. దీంతో వారంతా ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుని పవన్ కు పాజిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ మా ఫ్రెండ్ అంటూ రూటు మార్చి మాట్లాడుతున్నారు. ఇదే విషయమై చంద్రబాబు కూడా పవన్ తో భేటీ అయ్యి అక్కడ పరిస్థితులు వివరించనున్నారు. మొత్తానికి చిలికి చిలికి పెద్ద గాలివానలా మారుతుందనుకున్న పవన్-టీడీపీ వివాదాన్ని చంద్రబాబు చాకచక్యంగా సద్దుమణిగేలా చేసేశారు.