జనసేన కమిటీలు.. తెలిసిన పేర్లు ఒకట్రెండే

Update: 2018-07-23 17:38 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కమిటీలను ప్రకటించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ నియమితులయ్యారు. మీడియా హెడ్ - రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా హరిప్రసాద్ ను నియమించారు. కన్వీనర్ గా మాదాసు గంగాధరం - సభ్యులుగా తోట చంద్రశేఖర్ - అర్హమ్ యూసఫ్ - మరిశెట్టి రాఘవయ్యని నియమించారు.
   
జనసేన లీగల్ సెల్ హెడ్‌గా కె. చిదంబరంను - అధికార ప్రతినిధిగా ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబును నియమించారు. అయితే ఇంత వరకూ ఇంకా బూత్ లెవల్ కమిటీలు కూడా పవన్ ప్రకటించలేదు. ఇప్పుడిప్పుడే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
   
మరోవైపు జిల్లా కోఆర్డినేటర్లను - ఒక కన్వీనర్‌ ను నియమించారు. సీఎస్ పార్థసారథి కన్వీనర్‌ గా ఉంటారు. డాక్టర్ సునిధి - యశశ్విని - సుజాతా పండా - ఎస్కే సయ్యద్ బాబు - గద్దె తిరుపతి రావు - పి. హరి ప్రసాద్ - రవికుమార్ మండవ - డేవిడ్ రాజు - షేక్ నయూబ్ కమాల్ - అశోక్ యాదవ్ - రవి ప్రసాద్ - ప్రభు - భైర దిలీప్ - ఎం.రాధాకృష్ణమూర్తిని నియమించారు.
   
అయితే... పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్న ఆశావహులకు మాత్రం ఇంత వరకూ ఎలాంటి హోదా ఇవ్వకపోవడం గమనార్హం. జనసేన తరఫున తన గళం వినిపించే కల్యాణ్ దిలీప్ సుంకర లాంటి వ్యక్తులకు ఒక్కరికి అవకాశం రాకపోవడం గమనార్హం. టీవీ చానెల్స్‌లో చర్చా కార్యక్రమాలు మొదలుకుని ఇంటర్వ్యూల్లో జనసేన గళం వినిపించడం వరకు ఈయనే ఎక్కువగా కనిపిస్తుంటారు.
   
ఇప్పటికే ఆయన అసంతృప్తిగా ఉన్నారని.. పార్టీలో తనకు ప్రయారిటీ తగ్గిందని సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. అందుకే... ఈ మధ్య ఎక్కడా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న దాఖలాల్లేవ్ అని సమాచారం. మరోవైపు కమిటీల్లో ఉన్నవారిలో జనానికి బాగా పరిచయం పేర్లు ఒకట్రెండు మించి లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. అసలు పార్టీలో అనుభవజ్ఞులు లేకుండా, జనానికి తెలిసిన ముఖాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో సీఎం అయిపోతానంటూ పవన్ ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News