అలీకి గుడ్ న్యూస్ చెప్పేసిన జగన్... ?
టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ్య కెమెడియన్ అలీకి గుడ్ న్యూస్ చెప్పేశారా. జగన్ ఒక బిగ్ ఆఫర్ ని అలీకి ప్రకటించారా అన్నది ఇపుడు హాట్ హాట్ చర్చగా ఉంది. అలీ ముఖ్యమంత్రి జగన్ని సతీమణితో సహా తాజాగా కలవడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.
నిజానికి అలీ ఒక్కరే జగన్ని కలవవచ్చు. కానీ భార్యను కూడా వెంటబెట్టుకుని వచ్చారు అంటే కచ్చితంగా శుభవార్త ఏదో భర్యాభర్తలు ఇద్దరికీ జగన్ చెప్పి ఉంటారు అంటున్నారు.
అయితే మీడియా సమావేశంలో మాట్లాడిన అలీ మాత్రం తనకు ఎలాంటి శుభవార్త జగన్ చెప్పలేదని, తెలిస్తే ముందు మీడియాకే తెలిసి తరువాత తనకు తెలుస్తుంది అన్నారు. తాను మర్యాదపూర్వకంగానే సీఎం ని కలిశాను అంటున్నారు.
మరో వైపు తన భార్య సీఎం జగన్ తో ఫోటో తీయించుకోవాలని ఉందని చెప్పడంతో ఆమెను వెంటబెట్టుకుని వచ్చాను తప్ప వేరే మ్యాటర్ ఏదీ లేదని అన్నారు.
ఇదిలా ఉండగా అలీకి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం అయితే ఉంది. అదే సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ పోస్టు ఇస్తారని అంటున్నారు. ఇవేమీ కాకుండా ఆయనకు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన కీలక పదవి ఒకదాన్ని ఇస్తారు అని చెబుతున్నారు. టాలీవుడ్ లో అందరితో మంచి సంబంధాలు కలిగి ఉన్న అలీ చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరితోనూ బాగా ఉంటారు.
అందువల్ల అలీకి కనుక కీలకమైన పదవి ఇస్తే టాలీవుడ్ లో మరింత మంచి సంబంధాలు ఉంటాని జగన్ భావిస్తున్నారు అంటున్నారు. అదీ కాకుండా అలీ వైసీపీ విస్జయంలో కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి ఇన్నాళ్ళకు ఆయనకు తగిన పదవి ఇవ్వడం ద్వారా గౌరవించాలని జగన్ భావిస్తున్నారు అంటున్నారు.
మరో వైపు చూస్తే రాజ్యసభ రేసులో బిగ్ షాట్స్ ఉన్నందువల్ల అది సాధ్యపడకపోవచ్చునని, మరో వైపు ఇదే సీటు మీద కొందరు సినీ ప్రముఖులు ఆశ పెట్టుకున్నందువల్ల కూడా అలీ పేరు పరిశీలించకపోవచ్చు అంటున్నారు.
అయితే ఆయనతో మాట్లాడి తగిన పదవినే జగన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని, దాంతోనే జగన్ని అలీ వచ్చి కలిశారు అంటున్నారు.
ఇక అలీ కేవలం వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు జగన్ని కలవడం విశేషం. దాంతో డ్యామ్ ష్యూర్ గా ఒక పదవి అయితే అలీకి కన్ ఫర్మ్ అయింది. అదేంటి అన్నదే బయటకు తెలియడంలేదు. అలీ కూడా మీడియా సమావేశంలో ఫుల్ జోష్ గా కనిపించారు. ఆయన ముఖంలో పదవిని అందుకోబోతున్నాను అన్న ఆనందం అయితే కనిపిస్తోంది.
ఆయనకు ఏ పదవీ ఇస్తారు అన్నది తెలిసినా పార్టీ నుంచి ప్రకటన వచ్చేవరకూ బయటపడకూడనే గుంభనంగా ఉన్నారని అంటున్నారు. ఇక అలీ తనకు జగన్ ఎప్పటి నుంచో తెలుసు అని చెప్పడం ఈ సందర్భంగా విశేషం.
అంతే కాదు తాను పాలిటిక్స్ లో 23 యియర్స్ ఇండస్ట్రీ అని కూడా ఆయన చెప్పుకున్నారు. మొత్తానికి తన అనుభవానికి తగిన పెద్ద పదవిని ఆయన కోరుకుంటున్నారు అన్నది అర్ధమవుతోంది. చూడాలి మరి ఆ గుడ్ న్యూస్ ఎపుడు బయటకు వస్తుందో.