చంద్ర‌బాబుకు జ‌గ‌న్ డెడ్‌ లైన్‌

Update: 2015-09-01 16:07 GMT
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్‌ జగన్.. ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్‌ విధించారు. ప్రత్యేక హోదా అంశంలో ప్రభుత్వానికి ఆయన 15 రోజుల గడువు ఇచ్చారు. ఆలోపు ప్రత్యేక హోదా సాధించుకురావాలని, లేదంటే సెప్టెంబర్ 15 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని జగన్ ప్ర‌క‌టించారు. హైదరాబాద్ లోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా ఎప్పటిలోగా తెస్తారని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని జగన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా హామీని గాలికి వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు.

స్పెషల్ స్టేటస్ పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఇచ్చిన వివరణ సరిగా లేదన్నారు జగన్. ప్రత్యేక హోదాపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. టీడీపీ నేతల ప్రకటనల వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవాల‌ని, కేంద్ర మంత్రులను వెనక్కి తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెడ్‌ లైన్‌ విధిస్తేనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని జగన్‌ అభిప్రాయపడ్డారు. ప్ర‌త్యేక  హోదా కోసం ఇప్పటికే మంగళగిరిలో దీక్షలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Tags:    

Similar News