వైరల్: బికినీకి మాస్క్ కలిపితే ‘ట్రికినీ’

Update: 2020-05-14 02:30 GMT
బికినీలు తెలుసు.. టు పీస్ ఉండే వీటిని వేసుకొని హీరోయిన్లు - సుందరాంగులు జలకాటడుతుంటే సొల్లు కార్చే కుర్రకారు ఎందరో.. విదేశాల్లో కామన్ గా వేసుకునే ఇవి మన దేశంలోనూ ఇప్పుడు తారలు - మోడల్స్  బాగానే వేసుకుంటున్నారు.

అయితే ఇన్నాల్లు బికినీలుండేవి. ఇప్పుడు కరోనా దెబ్బకు ‘ట్రికినీ’లు వచ్చేశాయి. ఇదంతా కరోనా తెచ్చిన విపత్తు మరీ.. బికినీల్లో టు పీస్ లుంటే ‘ట్రికినీ’ల్లో మూడు పీసులంటాయి. ఒకటి డ్రాయర్ గా.. రెండోది చాతికి పెట్టుకుంటే.. ముచ్చటగా మూడో ముఖానికి పెట్టుకునేది.

కరోనాతో ఇప్పుడు అందరూ మాస్క్ పెట్టుకుంటున్నారు. మాస్క్ లేనిదే ఎవరూ బయటకు రావడం లేదు. ఇక బీచుల్లో స్నానానికి సేదతీరడానికి వెళ్లే బికినీ బేబీల కోసం ఇటలీలో ఒకావిడ కొత్త ఐడియా చేసింది. అది బాగా హిట్ అయ్యింది. ఇప్పుడిది ఫ్యాషన్ గా మారింది.దీనికి ‘ట్రికినీ’ అని ఇటాలియన్ డిజైనర్ పేరు పెట్టింది.

ఇటలీలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాలు అంతా బీచ్ లలో బికినీలతో సందడి చేస్తున్నారు. వారికి కరోనా సోకకుండా ఉండేందుకు ఎలెక్సా బీచ్ వేర్ యజమానికి టిజియానా సరికొత్తగా ఆలోచించింది. బీచ్ లలో తిరిగాలనుకునే వారికోసం ‘ట్రికినీ’లు తయారు చేసింది. బికినీ డ్రెస్ కాంబినేషన్ లోనే ముఖానికి అదే రంగు.. అదే బట్టతో మాస్క్ తయారు చేసింది.

ఇలా ఈ కొత్త రకం ‘ట్రికినీ’లకు ఇటలీలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బికినీల డ్రెస్ కు సూటయ్యే మాస్క్ లతో మోడల్స్ సందడి చేయడంతో వీటికి విపరీతమైన గిరాకీ వచ్చింది. ఫ్యాషన్ గా ఉండడంతో ఇవి కావాలని ఆర్డర్స్ వెల్లువెత్తుతున్నాయట.. లాక్ డౌన్ లో గిరాకీ తగ్గుతుందని అనుకుంటే కొత్తగా ఆలోచించడం వల్ల పెరిగిందని డిజైనర్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
Tags:    

Similar News