• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రిక్షా వాలాకు రూ.3 కోట్లు...

రిక్షా వాలాకు రూ.3 కోట్లు కట్టాలంటూ ఐటీ నోటీసులు !

By - Tupaki Desk
Update: 2021-10-25 07:19 GMT
రోజు మొత్తం రెక్కలు ముక్కలు చేసుకుంటే రూ.100లు కూడా సంపాదించలేని ఓ రిక్షావాలాకు రిక్షావాలాకు ఆదాయపు పన్ను శాఖ రూ.3 కోట్లు ట్యాక్స్ కట్టాలంటూ నోటీసు జారీ చేసిన ఘటన యూపీలోని మధుర జిల్లాలో సంచలనం రేపింది. దీంతో అతను హడలిపోయాడు. షాక్ అయ్యాడు. ఇదేంటీ నా సంపాదన ఎంత, నేను ట్యాక్స్ కట్టటం ఏంటీ, పైగా కోట్ల రూపాయలు కట్టాలని నాకు చెప్పటం ఏంటీ అంటూ భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మధుర జిల్లా అమర్ కాలనీకి చెందిన ప్రతాప్ సింగ్ అనే ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి రిక్షా నడుపుకుంటు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమం లో అతనికి ఐటీ శాఖ నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు వెంటనే రూ.3 కోట్లు ట్యాక్స్ కట్టాలని తెలిపారు. దీనితో ప్రతాప్ సింగ్ కు ఏం చేయాలో తెలియక మధుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ దీంట్లో ఏదో మతలబు ఉందని భావించిన పోలీసు అధికారి అనూజ్ కుమార్ సింగ్ కేసు నమోదు చేయకుండా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతాప్ సింగ్ ను పలు ప్రశ్నలు వేశారు.

ఇటీవల కాలంలో నువ్వేమన్నా ఎక్కడన్నా సంతకాలు పెట్టావా, అని అడిగారు.దానికి ప్రతాప్ సింగ్ మార్చి 15న తేజ్ ప్రకాష్ ఉపాధ్యాయ్ యాజమాన్యంలోని బకల్‌ పూర్‌ లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని, పాన్ కార్డును సమర్పించాల్సిందిగా తన బ్యాంక్ చెప్పారని దాని కోసం నేను పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. ఆతరువాత కొన్ని రోజులకు నాకు బకాల్ పూర్ చెందిన సంజయ్ సింగ్ నుంచి పాన్ కార్డు కలర్ జిరాక్స్ ఫొటో కాపీ వచ్చిందని, ఆతరువాత నాకు అక్టోబరు 19వతేదీన ఐటీ అధికారుల నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఆ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి 3,47,54,896రూపాయల ఆదాయపు పన్ను చెల్లించాలని పేర్కొన్నారని రిక్షావాలా చెప్పుకొచ్చాడు.

దీంతో పోలీసులకు విషయం అర్థం అయ్యింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎవరో వ్యాపారి సదరు రిక్షా వాలా ప్రతాప్ సింగ్ పేరుపై జిఎస్‌టి నంబరు పొందారని, 2018-19లో వ్యాపారి టర్నోవర్ రూ.43,44,36,201 అని అధికారులు చెప్పారని సింగ్ చెప్పాడు.

దీని పై బాధితుడు రిక్షా వాలా ప్రతాప్ సింగ్, నేను నిరక్షరాస్యుడినని, ఎవరో తనను మోసగించారని వాపోతు నా కేసు నమోదు చేసుకుని నాకు న్యాయం చేయాడని పోలీసుల్ని కోరాడు. ఇదే విషయాన్ని నేను ఐటీ అధికారులకు తెలిపానని వారు వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయమని అన్నారని వారి సలహా మేరకు నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాడు రిక్షా వాలా ప్రతాప్ సింగ్.
Tags:    
  • latestnews 
  • laterst updates 
  • trending news 
  • Newstoday 
  • Trend News 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS