కేసీయార్ ఎర్రకోట టూర్ రహస్యం ఇదేనా ?
హఠాత్తుగా కేసీయార్ మూడు రోజులు ఢిల్లీలో ఏమి చేశారు ? ప్రధానమంత్రి, కేంద్రమంత్రులతో వరుసగా భేటీలు వేసిన ముఖ్యమంత్రి ఏ లక్ష్యంతో వాళ్ళనంతా కలిశారు ? అన్న విషయాలపై ఇఫుడు తెలంగాణాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంత పెద్దఎత్తున చర్చలు జరగటానికి కారణం ఏమిటంటే కేంద్రం అంటేనే కేసీయార్ మొన్నటి వరకు మండిపోతున్న విషయం తెలిసిందే. కేంద్రం చేసిన కొన్ని చట్టాలను తెలంగాణాలో అమలు చేసేది లేదని స్పష్టంగా ప్రకటించారు. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేసీయార్ ప్రకటన చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
విదానపరమైన విషయాలపైన కూడా మోడిని వ్యతిరేకిస్తున్న కేసీయార్ హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళి అందరినీ ఎందుకు కలిసినట్లు ? ఈ విషయంలో స్పష్టత లేకపోవటంతోనే జనాలంతా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో కేసీయార్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ పనిచేసినా ఎంతో ఆలోచించి వ్యూహాత్మకంగా వ్యవహరించటం కేసీయార్ కు మొదటినుండి ఉన్న అలవాటని అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు ఉన్నటుండి ఢిల్లీకి వెళ్ళి మూడు రోజులుండి వచ్చారంటేనే తెరవెనుక ఏదో పెద్ద విషయం ఉందనే అనిపిస్తోంది.
దుబ్బాక ఉపఎన్నికలో గెలుపు, గ్రేటర్ లో మంచి ఫలితాల సాధనతో బీజేపీ మంచి ఊపుమీదున్న విషయం అందరు చూస్తున్నదే. బీజేపీ స్పీడుకు ఎలాగైనా బ్రేకులు వేయాలని కేసీయార్ ఆలోచించినట్లు సమాచారం. అందుకే వ్యూహాత్మకంగా ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకెళ్ళారంటే తెలంగాణాకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విషయంతో పాటు భారీ వర్షాలకు జరిటిన నష్టాలు తదితరాల కోసమని పైకి చెబుతున్నారు. అయితే ఆ డబ్బులను ఇచ్చే ఉద్దేశ్యంలో కేంద్రం లేదని సమాచారం.
సరిగ్గా ఈ పాయింట్ మీదే బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలిపేందుకు కేసీయార్ ఢిల్లీకి వెళొచ్చారని అంటున్నారు. బీజేపీ అంతా తుస్సు పార్టీయేనని మాటలు చెప్పటం తప్ప చేతల్లో చేసిందేమీ లేదని ప్రజలకు తెలియచెప్పటమే టార్గెట్ గా ఢిల్లీకి వెళ్లొచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీ వైఫల్యాలపై కాంగ్రెస్ కు ఆయుధాలను అందివటమే కేసీయార్ ఆలోచనగా చెబుతున్నారు. కాంగ్రెస్ గనుక బీజేపీని కార్నర్ చేస్తే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తనకు తిరుగుండదని కేసీయార్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. మరి కేసీయార్ వ్యూహంలో నుండి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాల్సిందే.