అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంటేనే లెక్క లేదా ?

Update: 2020-11-11 18:25 GMT
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అంటేనే లెక్క లేకుండా పోయిందా ?  యాపిల్ వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ అని ఉందిలేండి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వయస్సు ఎంత అని యూజర్లు సిరిని అడిగితే  ఉపాధ్యక్షురాలిగా గెలిచిన కమలా హ్యారిస్ పేరు, వయస్సు చెబుతోందట. ఎన్నికల్లో గెలిచిన బైడెన్ గురించిన వివరాలు కానీ ఓడిన ట్రంప్ వివరాలు కానీ సిరి దగ్గర లేదట. ఇదే విషయాన్ని యూజర్లు రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దాంతో అది కాస్త వైరల్ అయిపోవటంతో చివరకు యాపిల్ కంపెనీ దృష్టిలో పడిందట. దాంతో విషయంపై ఆరాతీసిన డెవలపర్లు చెక్ చేశారట. యూజర్లు చెప్పిన లోపం కరెక్టే అని నిర్ధారణ చేసుకున్న వెంటనే లోపాన్ని సర్దుబాటు చేశారట. దాంతో యూజర్లకు కావాల్సిన వివరాలను కరెక్టుగా ఇపుడిస్తోందట.
Tags:    

Similar News