మైక్ పట్టుకుంటే లోకేష్ షివెరింగ్ అవుతున్నాడా?

Update: 2021-04-10 23:30 GMT
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నిన్న సర్వేపల్లిలో జరిగిన ఉప ఎన్నికల ప్రచార సభలో టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ పాల్గొన్నాడు. అక్కడ టీడీపీ ఇన్ చార్జి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు లోకేష్ చాలా టెన్షన్ లో ఉన్నట్టు కనిపించాడు. యూట్యూబ్ లో ఆ వీడియో చూసిన ఎవరికైనా ఇదే అర్థం అవుతుంది. కావాలంటే చూసుకోవచ్చని ప్రత్యర్థులు చెబుతున్నారు.

ఎందుకో లోకేష్ మైక్ పట్టుకునే సరికి టెన్షన్ పడుతూ షేక్ అవుతున్నాడట.. కంటెంట్ బాగానే ఉన్నా.. పంచ్ లు పేలుతున్నా.. డెలివరీ బాగా లేదు అని భయపడుతూ మాట్లాడుతున్నాడు అని అనిపించిందట.. తప్పులు ఎక్కడ పోతాయో.. వైసీపీ ఎక్కడ ట్రోల్స్ చేస్తుందో అని ఆ భయం నుంచి లోకేష్ బయటపడలేకపోతున్నాడట..ఏది ఏమైనా లోకేష్ ను ఇంకా వైసీపీ వాళ్లు చిన్న పిల్లవాడు మాదిరి చూస్తున్నారని .. ఇంకా మెజారిటీ లేని లీడర్ అని అంటున్నారని టీడీపీ వర్గాలే అంటున్నాయి.

వైసీపీ వర్గాలు చంద్రబాబుకు భయపడుతున్నాయని.. లోకేష్ కు భయపడడం లేదు అని అంటున్నారని  చర్చ నడుస్తోంది. లోకేష్ భాష పటిమ మార్చుకోకుంటే ఇక ఎవరూ అతడిని లీడర్ గా గుర్తించరని.. ప్రతిపక్షాలు సైతం లైట్ తీసుకుంటాయని చెబుతున్నారు. 
Tags:    

Similar News