బీజేపీలో చేరనున్న ఆ స్టార్ హీరో !

Update: 2020-09-14 06:02 GMT
స్టార్ హీరో విశాల్ త్వరలోనే బీజేపీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ..రాష్ట్ర ఆ పార్టీ అధ్యక్షుడు మురుగన్‌ తో భేటీకి అపాయింట్ ‌మెంట్‌ కోరినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చెక్కెర్లు కొడుతోంది. హీరో విశాల్ గత కొన్ని రోజులుగా రాజకీయ రంగప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  ఆ మధ్య ఉప ఎన్నికల్లో ఆర్‌.కె.నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని విశాల్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన నామినేషన్‌ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.

కాగా , విశాల్ గతంలో జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ అధ్యక్షుడిగా, దక్షిణ భారత ఎన్నికల సంఘంకు కార్యదర్శిగా‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే , ఈ మధ్య రోజుల్లో కొన్ని కారణాల వల్ల మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన విశాల్‌ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడితో భేటీ కావడానికి హీరో విశాల్ సిద్దంఅయ్యారని ప్రచారం జరగడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్ ను భగత్ సింగ్ తో పోల్చిన విశాల్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో కంగనా రనౌత్ కు బీజేపీ మద్దతు తెలపడం, విశాల్ బీజేపీ నేతలతో కలవడానికి సిద్దం కావడంతో కథ కొత్తమలుపు తిరిగింది.

ఇకపోతే కంగనా‌కు బీజేపీ అండగా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో నటి కంగనా రనౌత్ ‌కు మద్దతు తెలిపిన విశాల్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్‌ను 14 లేదా, 15వ తేదీన భేటీ కావడానికి అపాయింట్‌మెంట్‌ కోరారు. ఈనేపథ్యంలో ఈయన త్వరలో బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం అవుతుంది. యితే తను బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటుడు విశాల్‌ కొట్టిపారేశారు.
Tags:    

Similar News