బాబుకు బంగారు పళ్ళెంలో అధికారం...?
ఏపీ రాజకీయం ఎలా సాగుతోంది. ఎవరు మళ్లీ పవర్ లోకి వస్తారు, చంద్రబాబుకు నాలుగవసారి ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా, జగన్ జాతకం ఏంటి ఇలాంటి చర్చలు అపుడే మొదలైపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సగం కాలం పైగా ఉండగానే వచ్చే కొత్త ప్రభుత్వం ఎవరిది అన్న దాని మీద రాజకీయ వేడి అయితే రాజుకుంటూనే ఉంది.
మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలో తన ఫ్యామిలీ మీద వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసగా సభకు అతి పెద్ద నమస్కారం అనేశారు. తాను తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతాను అని ఆయన స్పష్టంగా చెప్పారు.
మరి చంద్రబాబుని సీఎం చేయాల్సిన బాధ్యత ఎవరిది, ప్రజలదా, పార్టీ కార్యకర్తలదా అలా అయితే ఆయన కోసం టీడీపీ ఇప్పటి నుంచే గట్టిగా పనిచేయాలా, తమ్ముళ్ళు అంతా కలసి జనంలో ఉంటూ టీడీపీ విజయానికి బాటలు వేయాలా అన్న చర్చ కూడా సాగుతోంది. మరో వైపు చంద్రబాబు పాదయాత్ర చేయాలా లేక బస్సు యాత్ర చేయాలా అని ఆలోచిస్తున్నారు.
అలాగే పొత్తుల విషయంలో కూడా బాబు సీరియస్ గా ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఇలాంటి ఆయాసాలు ఏవీ అసలు పడనవసరం లేదని అధికారంలో ఉన్న వైసీపీ నిర్వాకం చెబుతోంది. బాబు బేఫికర్ గా ఉన్నా కూడా పవర్ అన్నది అలా వచ్చి మరీ ఆయనే మళ్ళీ సీఎంని చేస్తుంది అంటున్నారు.
బాబు అలా గమ్మున ఉంటే చాలు, ఆయన్ని ఎంచక్కా గెలిపించే బాధ్యత వైసీపీయే స్వీకరిస్తుందని, బాబుని భుజాల మీద మోసి మరీ అధికారాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తుందని కూడా కామెంట్స్ పడుతున్నాయి. అసలు ఏంటీ లాజిక్, దీనికేమైనా అర్ధముందా అంటే చాలానే ఉంది అని చెప్పుకోవాలేమో. వైసీపీ ఈ రోజు అధికారంలో ఉంది. పార్టీగా గెలిచింది. కానీ అదే పార్టీగా ఓడిపోతోంది అంటున్నారు వైసీపీ పోకడలను చూసిన వారు అంతా.
ఇక నియోజకవర్గాలలో చూసుకుంటే ప్రతీ చోటా వైసీపీ వర్గాలు అన్నీ ఇన్నీ కావు, ఎమ్మెల్యే వర్గం ఒకటైతే ఎమ్మెల్సీ వర్గం మరోటి, ఇక నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. దానికి చైర్మన్లుగా ఉన్న వారిదో వర్గం, అలాగే అనేక గొడవలు, విభేదాలతో పార్టీ ఉందని అంటున్నారు.
ఇక వీటికి తోడు అన్నట్లుగా వైసీపీలో పాత నాయకులు ఉంటే కొన్ని చోట్ల కొత్త నాయకులు అంటే అధికారంలోకి పార్టీ వచ్చాక వచ్చిన వారు ఉన్నారు. వారికీ వీరికీ అసలు పడదు, ఇక వీరిలో ఎవరికి మరొకరి పొడ గిట్టని పరిస్థితి ఉంది. ఇంకో వైపు చూసుకుంటే ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా రకరకాలైన విభేధాలు ఉన్నాయి. ఇలా ఎవరికి వారే యమునా తీరే అని వైసీపీ పరిస్థితి ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ లో తయారైంది.
వైసీపీలో ఇంతటి విభేధాలు గొడవలు ఉన్నా అధినాయకత్వం కనీసం పట్టించుకోవడం లేదు, దాంతో ఉన్న గ్రూపులు ఇంకా పెరిగిపోతున్నాయి. అలా అంతా కలసి పార్టీని చిరిగి చేటను చేశారు. ఆ మాటకు వస్తే ఒక ప్రశ్న కూడా వస్తుంది. అసలు వైసీపీ పార్టీని అధినాయకత్వం పట్టించుకుంటోందా అన్న చర్చ కూడా ఉంది. వైసీపీ ప్లీనరీ జరిగి నాలుగేళ్ళు పై దాటింది. జనరల్ బాడీ మీటింగ్స్ లేవు, కొత్తగా కార్యవర్గాలు లేవు, పాత వారే కొందరు ఉన్నారు.
చాలా మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అయిపోయారు. అలాగే ఇతర పదవులలో కుదురుకున్నారు. దాంతో జిల్లాలలో పార్టీ ఆఫీస్ అన్నది ఎక్కడ అన్న ప్రశ్న కూడా క్యాడర్ నుంచి వస్తోంది. ఈ నేపధ్యం నుంచి చూసుకుంటే వైసీపీలో ఉన్న విభేదాలు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కొంప ముంచుతాయని అంటున్నారు.
అదే టీడీపీకి వరంగా మారుతుంది అంటున్నారు. ఇన్ని వర్గాలుగా విడిపోయిన తరువాత వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా సొంత పార్టీ వారే ఓడిస్తారని, అలా టీడీపీకే భారీ మేలు చేకూరుతుంది అన్న చర్చ కూడా ఉంది. అప్పట్లో కాంగ్రెస్ ఏలుబడిలో ఎన్టీయార్ కి ఇలాగే రెండు సార్లు బంగారు పళ్ళెంలో అధికారాన్ని కాంగ్రెస్ నాయకులు అందించిన తీరుని అంతా గుర్తుచేసుకుంటున్నారు.
ఇపుడు కూడా అలాంటి సీన్ రిపీట్ అవుతుందా అంటే అవును అనే జవాబు వస్తోంది. తెలుగుదేశం పార్టీ పెద్దగా శ్రమ పడకుండానే బాబు పాదయాత్రలు వంటి సాహసాలు చేయకుండానే టీడీపీకి అధికారం ఒడిలోకి వచ్చి పడేలా సీన్ ఉందని అంటున్నారు. మొత్తానికి వైసీపీని ఎవరు ఓడిస్తారు అంటే సొంత పార్టీ వారే అన్న సమాధానం రావడం అంటే కచ్చితంగా ఆ పార్టీ పెద్దలు ఆలోచించాల్సిన విషయమే. అదే సమయంలో ఇవన్నీ టీడీపీకి ఖుషీని కలిగించే పరిణామాలుగానే చూడాలని చెబుతున్నారు.