ఢిల్లీ తుక్కురేగొట్టిన ముంబై..రయ్ రయ్ మంటూ ఫైనల్లోకి అడుగు
ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-1లో అదరగొట్టింది. బ్యాటింగ్‌లో కుర్రాళ్ళు ఇరగదీయగా, బౌలర్లు కూడా విశ్వరూపం చూపించి ఢిల్లీ జట్టులో ముగ్గురిని డకౌట్ చేయడంతో ముంబై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఢిల్లీపై విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా మంబయి రికార్డు సృష్టించింది. కాగా ఫస్ట్ టైమ్ ఫైనల్ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫయిర్-2పై ఆశలు పెట్టుకుంది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆరంభమే పెద్ద షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ అశ్విన్ బౌలింగ్ లో మొదటి బాల్ కే డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ (30 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 నాటౌట్), సూర్యకుమార్ (38 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51), డికాక్ (25 బాల్స్‌లో 5 ఫోర్లతో 1 సిక్స్‌తో 40), ఫోర్లు, సిక్సర్లతో దంచికొట్టారు. పోలార్డ్ కూడా సున్నా చుట్టినా హార్దిక్ (14 బాల్స్‌లో 5 సిక్సర్లతో 37 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి ముంబై 200 మార్క్ చేరుకునేలా చేశాడు.
భారీ టార్గెట్ తో ఛేదన మొదలు చెప్పిన ఢిల్లీ క్యాపిటల్స్ కి ముంబై బౌలర్ బూమ్రా, బౌల్ట్ చుక్కలు చూపించారు. వారి బౌలింగ్ ధాటికి ఢిల్లీ ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోయింది.బౌల్ట్ ఫస్ట్ ఓవర్ సెకండ్, ఫిప్త్ బాల్‌కు పృథ్వీ (0), రహానె (0), బుమ్రా సెకండ్ ఓవర్ రెండో బాల్‌కు ధవన్ (0) ఔటయ్యారు. దీంతో 0/3తో ఢిల్లీ కష్టాల్లో పడిపోయింది.
కెప్టెన్ శ్రేయస్ (12), రిషబ్ పంత్ (3) కూడా ఫెయిల్ కావడంతో 41 పరుగులకే ఢిల్లీ సగం వికెట్లను కోల్పోయింది.ఈ దశలో స్టోయినిస్(46 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65) చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాడు. అతడికి అక్షర్ పటేల్(33 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42) సహకారం అందించాడు. వీరిద్దరూ ఔట్ అయ్యాక సామ్స్ (0) కూడా వెనుదిరగడంతో ఢిల్లీ 143 పరుగులకే పరిమితం కాగా ముంబై 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై బౌలర్లలో బుమ్రా (4/14), బౌల్ట్ (2/9) అద్భుతంగా ఆడారు.బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
ముంబై 4 ఓవర్ల లో 60 రన్స్
ముంబై ఇన్నింగ్స్ లో కీలక మలుపు 17వ ఓవర్ నుంచి మొదలయింది. కిషన్ తో జతకలిసిన హార్దిక్ ఢిల్లీ బౌలర్లను ఆడుకున్నారు.ఆరో వికెట్ కు23 బాల్స్‌లోనే 60 పరుగులు చేశారు. నువ్వా నేనా అన్నట్లు గా వాళ్ళిద్దరూ కౌంటర్లు మోత మోగించడంతో ముంబై స్కోరు 200లకు చేరింది.
రోహిత్ చెత్త రికార్డ్
ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట చెత్త రికార్డు లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు(13) డకౌటైన ఆటగాడిగా నిలిచాడు. హిట్‌మ్యాన్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి ఈ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. రెండో ఓవర్లోనే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇప్పటి వరకూ పార్థీవ్ పటేల్, హర్భజన్ సింగ్ మాత్రమే 13సార్ల చొప్పున ఐపీఎల్ లో డకౌటయ్యారు. తాజా గోల్డెన్ డకౌట్ తో రోహిత్ వారి సరసన నిలిచాడు.