ఇంటర్ విద్యార్థిని సూసైడ్ .. సూసైడ్ నోట్ లో ఏం రాసిందంటే !
సూసైడ్ .. ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూడటం , దాని పరిష్కరానికి దారి వెదుక్కోకుండా , ప్రాణాల్ని తీసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకి కూడా చాలామంది ఆత్మహత్య కి పాల్పడుతూ .. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది , సూసైడ్ నోట్ లో ఏముంది అంటే?
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. సర్దార్ పటేల్ నగర్కు చెందిన ఎల్లేష్, చంద్రకళ భార్యభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె తనూష ఉన్నారు. కుమార్తె ప్రస్తుతం ప్రజ్ఞాపూర్ లోని గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే కరోనా నేపథ్యంలో గత కొన్నిరోజులుగా ఇంటివద్దే ఉంటుంది. అయితే సోమవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు మల్లేష్, చంద్రకళ, సోదరుడు పవన్‌కుమార్ బయటికి వెళ్లిన సమయంలో తనూష బలవనర్మణానికి పాల్పడింది. అయితే పనిమీద బయటకు వెళ్లిన చంద్రకళ ఇంటికి తిరిగివచ్చే సరికి కూతురు ఆత్మహత్య చేసుకోవడాన్ని గుర్తించింది.బాత్ రూమ్ లో కాలిన గాయాలతో ఉన్న తననూషను గమనించి వెంటనే భర్తకు ఫోన్ ద్వారా తెలియజేసింది.
ఆ తర్వాత 108కి ఫోన్ చేసి సమాచారం అందించింది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను పరీక్షించారు. అయితే అప్పటికే ఆ అమ్మాయి మృతిచెందినట్టుగా వారు ధ్రువీకరించారు. ఈ విషయంపై సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్ తనూష.. తన చావుకు తల్లిదండ్రులు కారణం కాదని, జీవితం మీద విరక్తితోనే కిరోసిన్ పోసుకుని చనిపోదామనుకుంటున్న అని రాసింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.