తెలంగాణ బీజేపీ ఆఫీస్‌లో ఇంటిలిజెన్స్ త‌నిఖీలు.. కిష‌న్ రెడ్డి ఫైర్‌

Update: 2022-10-02 17:46 GMT
తెలంగాణ బీజేపీలో తీవ్ర క‌ల‌కలం రేగింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసే.. ఇంటిలిజెన్స్ అధికారులు.. బీజేపీ రాష్ట్ర కార్యాల యంలోకి ప్ర‌వేశించారు. వ‌స్తూ.. వ‌స్తూనే.. వారు త‌నిఖీలు చేశారు. దీంతో ఆఫీస్‌లో ఉన్న నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌లు.. నిర్ఘాంత పోయారు. అస‌లు ఏం జ‌రిగింద‌ని ప్ర‌శ్నించే లోగానే.. వారిని బ‌య‌ట‌కు వెళ్లాల‌ని.. అధికారులు ఆదేశించారు. అయితే.. వెంట‌నే ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి ఫోన్‌లో చెప్పారు. దీంతో ఆయ‌న ఇంటిలిజెన్స్ అధికారుల‌తో మాట్లాడిన‌ట్టు తెలిసింది.

అనంత‌రం కొద్ది సేప‌టికి.. వారు వెళ్లిపోయారు. ఆదివారం మ‌ధ్యాహ్నం.. ఉరుములు లేని పిడుగులా చోటు చేసుకున్న ఈ ఘ‌ట న రాష్ట్ర బీజేపీలో తీవ్ర క‌ల‌క‌లం రేపిగింది. ఇక‌, ఈ ఘ‌ట‌న‌పై కిష‌న్ రెడ్డి స్పందించారు. ఇంటిలిజెన్స్ అధికారుల‌పై ఆయ‌న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అంటూ నిప్పులు చెరిగారు. మరోసారి కార్యాలయంలోకి వస్తే బాగోదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.  

ప్రగతిభవన్, తెలంగాణ భవన్‌లో ఐబీ వాళ్లను పెడతా సీఎం ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. అక్కడ ఒప్పుకుంటే.. ఇక్కడ ఇంటెలిజెన్స్‌వారికి ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేస్తానంటూ  కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తాము త‌లుచుకుంటే.. నిముషాల్లోనే ఐబీ.. రంగంలోకి దిగుతుంద‌ని అన్నారు. ఇవ‌న్నీ.. రాజ‌కీయ ప్రేరేపిత దాడులుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. మ‌త విద్వేషాల‌కు ఎవ‌రు పాల్ప‌డుతున్నారో.. ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని.. వ్యాఖ్యానించారు. ఒక నాయ‌కుడు త‌లుచుకుంటే.. ఏదో అయిపోతుంద‌ని అనుకుంటే.. పొర‌పాటేన‌ని సీఎం కేసీఆర్‌పై ఆయ‌న ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు గుప్పించారు.  మ‌రి దీనిపై అధికార పార్టీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News