ప్రపంచంలోనే తెలివైన విద్యార్థినిగా భారతీయ చిన్నారి .. ఎవరంటే !

Update: 2021-08-04 10:50 GMT
భార‌త‌-అమెరికా సంత‌తికి చెందిన 11 ఏళ్ల న‌టాషా పేరి రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఆమె బ్రైటెస్ట్ స్టూడెంట్స్ లిస్టులో పేరు సంపాదించింది. 84 దేశాల‌కు చెందిన సుమారు 19వేల మంది విద్యార్థులు పాల్గొన్న ప‌రీక్ష‌లో ఆమె టాప్‌ లో నిలిచింది. అమెరికాలోని మేరీల్యాండ్‌ లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ నిర్వ‌హించిన ట్యాలెంట్ టెస్టులో ఆమె అగ్ర‌స్థానాన్ని సంపాదించింది.

సాండ్‌మేయ‌ర్ ఎలిమెంట‌రీ స్కూల్‌లో న‌టాషా చ‌దువుకుంటోంది. సీటీవై ట్యాలెంట్ ప‌రీక్ష‌లో భాగంగా నిర్వ‌హించిన ఎస్ఏటీ, ఏసీటీ ప‌రీక్ష‌ల్లో న‌టాషా అత్యుద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. చురుకుగా ఉన్న విద్యార్థుల్లో అకాడ‌మిక్ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించేందుకు సీటీవై ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంటారు. 2021 సీజ‌న్‌లో జాన్స్ హాప్కిన్స్ ట్యాలెంట్ టెస్టుకు న‌టాషా పేరీ హాజ‌రైంది. అయిద‌వ గ్రేడ్ చ‌దువువుతున్న ఆ విద్యార్థిని.. వర్బ‌ల్‌, క్వాంటిటేవివ్ సెక్ష‌న్‌లో.. గ్రేడ్ 8 ప‌ర్ఫార్మెన్స్‌ను ప్ర‌ద‌ర్శించింది. సీటీవై ఇచ్చే హై హాన‌ర్స్ అవార్డుకు న‌టాషా ఎంపికైంది.

స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (శాట్‌), అమెరికన్‌ కాలేజీ టెస్టింగ్‌(యాక్ట్‌)లలో అసమాన ప్రతిభ చూపించినందుకు అమెరికాలోని న్యూజెర్సీ విశ్వవిద్యాలయం నటాషా పేరిని అత్యంత తెలివైన చిన్నారిగా గుర్తించి గౌరవించింది. అమెరికాలో ఎన్నో కాలేజీల్లో అడ్మిషన్ల కోసం శాట్, యాక్ట్‌ పరీక్షల్లో వచ్చే స్కోర్‌నే కొలమానంగా తీసుకుంటాయి. జాన్‌ హాప్‌ కిన్స్‌ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ టాలెంటెడ్‌ యూత్‌ (సీటీవై) సెర్చ్‌లో భాగంగా నిర్వహించిన శాట్, యాక్ట్‌ పరీక్షల్లో నటాషా అత్యుద్భుతమైన ప్రతిభ కనబరిచింది. న్యూజెర్సీలోని ఒక ఎలిమెంటరీ స్కూలులో నటాషా చదువుకుంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సీజన్‌లో పరీక్షలు నిర్వహించి అత్యంత తెలివైన విద్యార్థుల్ని ఈ సంస్థ ఎంపిక చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం స్ప్రింగ్‌ సీజన్‌లో పరీక్షలు రాసిన గ్రేడ్‌-5కి చెందిన నటాషా తన వయసుకి మించిన ప్రతిభను ప్రదర్శించి గ్రేడ్‌-8 వారితో సమానంగా స్కోరు సాధించింది. దీంతో జాన్స్‌ హాప్‌ కిన్స్‌ యూనివర్సిటీ హై ఆనర్స్‌ అవార్డుకి ఎంపికైంది. ఇందులో విజయం సాధించడం తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్న నటాషా పేరి తాను ఇంకా ఎంతో సాధిస్తానన్న ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.


Tags:    

Similar News