అరుణాచల్ ప్రదేశ్ చైనాదంటా ..ఎవరన్నారంటే ?
భారత్ , చైనా సరిహద్దుల్లో వివాదం రోజురోజుకి మరింత ముదిరిపోతున్న సమయంలో తాజాగా మరోసారి చైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఇన్నాళ్లూ సైన్యంతో రెచ్చగొట్టిన చైనా, ఇప్పుడు మాటలతో ఆ పని చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ను తామెప్పుడూ గుర్తించలేదని, అది తమ దేశంలోని దక్షిణ టిబెట్ ప్రాంతమని కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ను కోట్ చేస్తూ.. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఐదుగుర్ని చైనా సైనికులు అపహరించారని వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వలేదు.
ఇండియన్ ఆర్మీ ఈ విషయమై పీఎల్ ఏ కు సమాచారం ఇచ్చినట్లు తమ దగ్గర వివరాలేవీ లేవని ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద ఐదుగురు భారతీయులు అదృశ్యమయ్యారని చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి భారత సైన్యం హాట్‌లైన్ ద్వారా సందేశం పంపిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు వ్యాఖ్యానించిన నేపథ్యంలో చైనా ఇలా స్పందించడం విశేషం. వేటకు వెళ్లిన సమయంలో టగిన్ తెగకు చెందిన టోచ్ సింగ్‌కమ్, ప్రసత్, రింగ్లింగ్, డోంగ్టు ఎబియా, తను బకెర్, ఎంగ్రూ దిరి అనే ఐదుగుర్ని చైనా సైన్యం అపహరించింది. మరో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని రావడంతో ఇది వెలుగు చూసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. బాధితుల కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. తమవారి కిడ్నాప్ విషయమై భారత ఆర్మీతో చర్చించేందుకు తమ బంధువులు వెళ్లారని తెలిపారు. నాచో జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.